Tadepalli Gang Rape Case: తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులకు కనిపించిన నిందితుడు.. అంతలోనే మాయం..!

|

Jun 24, 2021 | 7:48 AM

గ్యాంగ్ రేప్ నిందితుల్లో ఒకరు బుధవారం తాడేపల్లి రైల్వే ట్రాక్ వద్ద కనిపించినట్లు సమాచారం. మత్స్యకారులు చేపలుపడుతూ నిందితుడు కృష్ణాను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Tadepalli Gang Rape Case: తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులకు కనిపించిన నిందితుడు.. అంతలోనే మాయం..!
Father bad behavior
Follow us on

Tadepalli Gang Rape Case: గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని సీతానగరంలో యువతిపై గ్యాంగ్ రేప్‌ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ రేప్ నిందితుల్లో ఒకరు బుధవారం తాడేపల్లి రైల్వే ట్రాక్ వద్ద కనిపించినట్లు సమాచారం. మత్స్యకారులు చేపలుపడుతూ నిందితుడు కృష్ణాను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో భారీ బలగాలతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు.. అటుగా వస్తున్న గూడ్స్ రైలు ఎక్కి పారిపోయాడు. కాలువ వద్ద నిందితుడు కృష్ణాకు సంబంధించి దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అత్యాచార ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా ఇంతవరకూ నిందితులు దొరకలేదు. నిందితుల కోసం గుంటూరు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎక్కడి నుంచి ఏ చిన్న సమాచారం అందినా వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపడుతున్నారు. సీతానగరంకు చెందిన కృష్ణా, వెంకటేష్ అనే యువకులే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణానది ఇసుక తిన్నెలు, పుష్కరఘాట్లలో ఒంటరిగా సంచరించేవారిపై వీరిద్దరు గతంలో దాడులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. యువతి, ఆమెకు కాబోయే భర్త దగ్గర లాక్కున్న ఫోన్లను దాస్ అనే వ్యక్తి దగ్గర నిందితులు తాకట్టుపెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

అయితే, ఇదే క్రమంలో పోలీసుల ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారులు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం పోలీసులు వెంటనే తాడేపల్లి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి నిందితుడి కోసం విస్తృతంగా గాలించారు. ఇంతలో కృష్ణా కెనాల్ బ్యారేజ్ పై గూడ్స్ నిలిచిపోవడంతో ట్రైన్ నుండి దూకిన నిందితుడు కృష్ణా సమీపంలోని పొదల్లోకి తప్పించుకుపోయాడు. నిందితుడి కోసం డాగ్ స్వ్కాడ్ తో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

Read Also…Oldcity Accident: పాతబస్తీలో బెంజ్ కారు బీభత్సం.. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద అతివేగంగా వాహనాల ఢీ.. ఒకరు మ‌ృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు