Telangana Crime: పాఠశాలలో సెల్ ఫోన్ మాయం.. విద్యార్థినిపై నింద.. మనస్తాపంతో చివరికి

కరోనా(Corona) కారణంగా చాలా కాలంగా పాఠశాలలు మూతబడి ఈ మధ్యే తెరుచుకుంటున్నాయి. కొవిడ్ లాక్ డౌన్ (Lock Down) సమయంలో విద్యార్థుల చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆన్ లైన్(Online) విధానంలో...

Telangana Crime: పాఠశాలలో సెల్ ఫోన్ మాయం.. విద్యార్థినిపై నింద.. మనస్తాపంతో చివరికి
Missing
Follow us

|

Updated on: Apr 01, 2022 | 7:10 PM

కరోనా(Corona) కారణంగా చాలా కాలంగా పాఠశాలలు మూతబడి ఈ మధ్యే తెరుచుకుంటున్నాయి. కొవిడ్ లాక్ డౌన్ (Lock Down) సమయంలో విద్యార్థుల చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆన్ లైన్(Online) విధానంలో పాఠాలు చెప్పారు. ఫలితంగా ప్రతి ఒక్క విద్యార్థి వద్దకు సెల్ ఫోన్ చేరింది. ఇక ఏముంది.. తరగతుల కోసం తీసుకున్న ఫోన్లను ఇతర పనులకూ ఆడుకున్నారు. అయితే ఈ మధ్య పాఠశాలలు తెరిచారు. ఆన్ లైన్ విధానం బంద్ అయి, ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో సెల్ ఫోన్లు తీసుకురావడాన్ని ఉపాధ్యాయులు నిషేధించారు. కానీ వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ పాఠశాలలో ఓ విద్యార్థిని పాఠశాలకు ఫోన్ తీసుకువచ్చింది. అది పోవడంతో మరో విద్యార్థినిపై నింద వేశారు. నువ్వే తీశావంటూ నిలదీశారు. చివరకు విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెను తీవ్రంగా కొట్టారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వికారాబాద్ జిల్లాలోని తాండూరు మున్సిపాలిటీ ఏడో వార్డులో రమేశ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని కుమార్తె సాయిపూర్‌ ప్రాంతంలోని నెంబర్‌–1 ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. పాఠశాలలో సెల్‌ఫోన్లు ఉపయోగించవద్దని నిబంధనలు ఉన్నా ఉపాధ్యాయులు, కొందరు విద్యార్థులు యథేచ్ఛగా చరవాణులను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 25న ఓ విద్యార్థిని పాఠశాలకు సెల్‌ఫోన్‌ తీసుకొచ్చింది. అది కనిపించకుండాపోవడంతో సదరు బాలిక ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలు విజ్ఞప్తితో ఉపాధ్యాయులు తొమ్మిదో తరగతిలోకి వెళ్లి వెదికారు. సెల్‌ఫోన్‌ బాత్రూంలో దొరికింది. అంతటితో ఆగకుండా సెల్‌ఫోన్‌ను ఓ బాలిక దొంగిలించిందని ఆమెపై చోరీ నింద వేశారు. విద్యార్థుల ఎదుటే ఆమెకు చివాట్లు పెట్టారు. అనంతరం సదరు బాలిక తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చోరీ విషయం చెప్పారు. అనంతరం ఇంటికెళ్లిన బాలికను తల్లిదండ్రులు దండించారు. తాను దొంగతనం చేయలేదని చెప్పినా వినకుండా కొట్టారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోంచి వెళ్లిపోయింది. రెండు రోజులుగా ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read

ShoMeenakshi Chaudhary: గ్లామర్ డోస్ పెంచి అభిమానులకు దగ్గరవుతున్న తెలుగు హీరోయిన్ మీనాక్షి

చౌదరి..cking: బాత్రూం సోప్​ బాక్స్​లో కెమెరా.. డైలీ పాఠాలు చెప్పే టీచర్ ప్రైవేట్ వీడియోలు రికార్డ్..

చివరకు..

Vijayawada Temple: రేపటి నుంచి వసంత నవరాత్రులు.. ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి