Man kills Wife and Sister in Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో ఓ వ్యక్తి ఇద్దరిని చంపి ఆపై తాను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన భార్యతో పాటు అడ్డుగా వచ్చిన సోదరిని కూడా హతమార్చాడు కిరాతకుడు. ఈఘటనలో తండ్రితో పాటు సోదరి కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ముద్దాడపేటలో నివాసముంటే వి.సి అప్పన్న మద్యానికి బానిసైయ్యాడు. దీంతో ప్రతిరోజు కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భార్య అప్పమ్మపై దాడికి తెగబడ్డాడు. అడ్డుగా వచ్చిన తన సోదరి రాజులను హత్య చేశాడు. భార్యను చంపుతుండగా అడ్జొచ్చిన తన తండ్రితో పాటు సోదరి కుమార్తె పద్మను కూడా అప్పన్న గాయపరిచాడు. ఈ ఘటనలో గాయపడిన వారితో పాటు అప్పన్న శ్రీకాకుళం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. అప్పన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా, ఈ హత్యలకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Also…. East Godavari District: ‘ప్రేమతో డబ్బు, బంగారం ఇచ్చా.. తనేమో హ్యాండిచ్చింది’.. యువకుడు ఆత్యహత్య