Latest Crime: చికిత్స కోసం వచ్చిన రోగిని ఉద్యోగం పేరిట అమ్మేశాడు.. హైదరాబాద్ వైద్యుడి అరాచకాలు..

Latest Crime: హైదరాబాద్‌లో ఓ వైద్యుడు అక్రమ దందాకి తెరతీశాడు. వైద్యం కోసం తనవద్దకు వచ్చే రోగులకు ఉద్యోగం ఆశ చూపి

Latest Crime: చికిత్స కోసం వచ్చిన రోగిని ఉద్యోగం పేరిట అమ్మేశాడు.. హైదరాబాద్ వైద్యుడి అరాచకాలు..

Updated on: Jan 14, 2021 | 10:44 AM

Latest Crime: హైదరాబాద్‌లో ఓ వైద్యుడు అక్రమ దందాకి తెరతీశాడు. వైద్యం కోసం తనవద్దకు వచ్చే రోగులకు ఉద్యోగం ఆశ చూపి విదేశాలకు విక్రయిస్తున్నాడు. అమాయకులను మోసం చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నాడు. హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రాంతంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గోల్కొండ కోటోరా హౌస్‌ వద్ద వైద్యుడు షబ్బీర్‌హుస్సేన్‌ షిఫా క్లినిక్‌ నిర్వహిస్తున్నాడు. టోలిచౌకి సమతా కాలనీకి చెందిన తాహేరాబేగం వైద్యం కోసం ఇతడి దగ్గరకు వచ్చింది. అయితే అమాయకురాలైన ఆమెకు కువైట్‌లో ఓ ఇంట్లో పని మనిషిగా చేరితే నెలకు రూ.25వేలు సంపాదించవచ్చని ఆశ చూపాడు. అప్పుల్లో ఉన్న తాహేరాబేగం అందుకు అంగీకరించింది. గతేడాది ఫిబ్రవరి 3న ఆమె కువైట్‌కు పయనమైంది. అక్కడ షబ్బీర్‌హుస్సేన్‌ తమ్ముడు తాహేరాబేగంను కలవాగా అల్‌ షమారీ అనే వ్యక్తి ఇంట్లో పనిలో కుదిర్చాడు. కొద్ది రోజులు తర్వాత అల్‌షమారీ తాహేరాబేగాన్ని వేధించడం మొదలెట్టాడు. తనను తిరిగి ఇండియాకు పంపాలని అల్‌షమారీని వేడుకోగా షబ్బీర్‌హుస్సేన్‌కు రూ.2లక్షలు చెల్లించి ఆమెను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. దీంతో తాహేరాబేగం తన కుమార్తె తరన్నుం బేగంకు చెప్పి తనను ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటుంది.

బిహార్‌లో దారుణం.. మూగబాలికపై అఘాయిత్యం.. గుర్తుపట్టకూడదని కళ్లల్లో పొడిచిన దుండగులు..

Loading...
Unable to load recommendations.
Follow Us