హైదరాబాద్‌లో విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో టెకీ కుటుంబం ఆత్మహత్య..!

| Edited By:

Mar 02, 2020 | 9:02 AM

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ టెకీ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.  ఎల్‌బీనగర్ పరిధిలోని హస్తినాపురంలో ఈ హృదయవిదారక ఘటన జరిగింది. 

హైదరాబాద్‌లో విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో టెకీ కుటుంబం ఆత్మహత్య..!
Follow us on

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ టెకీ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.  ఎల్‌బీనగర్ పరిధిలోని హస్తినాపురంలో ఈ హృదయవిదారక ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‌గా పనిచేస్తోన్న ప్రదీప్, తన భార్య స్వాతి, కుమారుడు కల్యాణ్, జయకృష్ణలతో కలిసి హస్తినాపురంలోని సంతోషిమాత కాలనీలో నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా వీరి కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చిన ప్రదీప్, స్వాతి ఆ తరువాత వారు కూడా తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు.  మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కాగా ప్రదీప్‌ స్వస్థలం దేవరకొండ మండలం నెరడుకొమ్మగా తెలుస్తోంది.