Kamareddy Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు దుర్మరణం..

Kamareddy Accident: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగన్నాధపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతోసహా ఆరుగురు

Kamareddy Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు దుర్మరణం..
Road Accident

Updated on: Dec 18, 2021 | 9:40 PM

Kamareddy Accident: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద కొడప్‌గల్‌ జగన్నాధపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతోసహా ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. జగన్నాథపురంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని క్వాలిస్ ఢికొనడంతో ఈ ప్రమాదం జరిగింది. చిచ్కుంద నుంచి పిట్లంవైపు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో వాహనంలో 12 మంది ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కారు వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కారు వేగంగా ఢీకొట్టడంతో ముందుభాగం నుజ్జునుజ్జయింది.

మృతులు హైదరాబాద్ పాతబస్తీ చాదర్ఘాట్ వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో వాహనంలో 11మంది ఉన్నారు. 2 రోజుల క్రితం మొహమ్మద్ అమీర్ తాజ్ మరియు మహమ్మద్ హుస్సేన్ తన ఫ్యామిలీతో మహారాష్ట్రలోని నాందేడ్ లోని ఓ దర్గా ను సందర్శించటానికి వెళ్లారు. తిరుగు ప్రయాణం సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. మహమ్మద్ అమీర్ తాజ్ తో పాటు భార్య సనా పర్వీన్ ఇద్దరు కూతుర్లు మృతి చెందారు. ఇద్దరు కొడుకులు తీవ్ర గాయాలతో ఆస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు

Also Read:

Collectors conference: జిల్లా కలెక్టర్లతో సీఎం విస్తృతస్థాయి సమావేశం.. ఇవాళ దళిత బంధు పథకంపై కేసీఆర్ కీలక ప్రకటన

CJI NV Ramana: హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్.. ప్రారంభించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

Pawan Kalyan: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన జనసేనాని.. 3రోజులపాటు సాగనున్న క్యాంపెయిన్..