Murder: కుటుంబంపై ఆగంతకుడి దాడి.. కత్తితో అత్యంత పాశవికంగా ఆరుగురి హత్య.. చిన్న పిల్లలపై…

|

Apr 15, 2021 | 10:24 AM

Six people murder: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ అగంతకుడు ఒకరు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురిని అత్యంత దారుణంగా హతమార్చాడు. చిన్న పిల్లలను సైతం

Murder: కుటుంబంపై ఆగంతకుడి దాడి.. కత్తితో అత్యంత పాశవికంగా ఆరుగురి హత్య.. చిన్న పిల్లలపై...
Murder
Follow us on

Six people murder: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ ఆగంతకుడు.. ఒకరు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురిని అత్యంత దారుణంగా హతమార్చాడు. చిన్న పిల్లలను సైతం అత్యంత పాశవికంగా పొట్టనబెట్టుకున్నాడు. విశాఖపట్నంలోని పెందుర్తి మండలం జుత్తాడలో జరిగిన ఈ దారుణ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. వివరాలు.. పాత కక్షల నేపథ్యంలో ఓ అగంతకుడు.. ఇంట్లో నిద్రిస్తున్న రమణ కుటుంబంపై దాడి చేసి చంపాడు. పదునైన ఆయుధంతో ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులందరినీ దారుణంగా హత్యచేశాడు. మృతదేహాలన్నీ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం పెందుర్తిలోని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీపీ మనీష్ కుమార్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతులు రమణ (63), ఉషారాణి (35), రమాదేవి (53), అరుణ(37) చిన్నారులు ఉదయ్ (2), ఉర్విష ( 6 నెలలు) గా గుర్తించారు.

రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలే ఈ సంఘటనకు కారణమని పేర్కొంటున్నారు. ఆరుగురిని అప్పలరాజు అనే వ్యక్తే చంపిఉంటాడని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అనంతరం అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను సేకరిస్తున్నారు. ఆరుగురి హత్యతో జుత్తాడలో విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆరుగురి హత్యపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: