Sircilla Road Accident: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో బోల్తా.. 18 మంది కూలీలకు తీవ్ర గాయాలు..

Sircilla Road Accident: రాజన్నసిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ ఆటో బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న 18 మందికి గాయాలయ్యాయి...

Sircilla Road Accident: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో బోల్తా.. 18 మంది కూలీలకు తీవ్ర గాయాలు..
Mahabubnagar Road Accident

Updated on: Feb 03, 2021 | 1:07 PM

Sircilla Road Accident: రాజన్నసిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ ఆటో బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న 18 మందికి గాయాలయ్యాయి. సిరిసిల్లలోని సుభాష్‌ నగర్‌కు చెందిన కూలీలు దుమాల గ్రామంలో పత్తి తీసేందుకు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఆటో ఎల్లారెడ్డిపేట మండలం వరిపొలంలో బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.

కూలీలు ప్రయాణిస్తున్న ఆటోకు ఎదురుగా రేకుల లోడ్‌తో ట్రాలీ వెళ్తోంది. ఈ క్రమంలో అందులో ఓ రేకు పైకి ఎగిరి ప్యాసింజర్‌ ఆటో వైపు దూసుకురావడంతో డ్రైవర్‌ దానిని తప్పించే ప్రయత్నం చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా, ప్రమాదానికి కారణైన ట్రాలీ ఆటో డ్రైవర్‌ పరారీలో ఉండగా, ప్యాసింజర్‌ ఆటో డ్రైవర్‌ బుర్ర శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read:

Road Accident: మొక్కలు నాటుతున్న కూలీలపై దూసుకొచ్చిన మినీ వ్యాన్‌.. ముగ్గురు మహిళా కూలీలు మృతి

Banjara Hills: భార్యభర్తల మధ్య గొడవలు.. ఎనిమిది నెలల చిన్నారిని ఎత్తుకుని భవనం పైనుంచి దూకిన తల్లి