Sanitizer Terror: మహారాష్ట్రలో దారుణం.. ఏడుగురి ప్రాణాలను బలి తీసుకున్న శానిటైజర్.. తప్పుడు సమాచారంతో ఇదంతా..!

శానిటైజర్‌ తాగిన ఏడుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని యావత్మల్‌ తహసీల్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది.

Sanitizer Terror: మహారాష్ట్రలో దారుణం.. ఏడుగురి ప్రాణాలను బలి తీసుకున్న శానిటైజర్.. తప్పుడు సమాచారంతో ఇదంతా..!
Seven Die After Consuming Sanitizer In Maharashtra

Updated on: Apr 24, 2021 | 5:11 PM

Seven die after consuming sanitizer: మహారాష్ట్రలో కరోనా మిగుల్చుతున్న విషాదం అంతా ఇంత కాదు.. తాజాగా మరో తీవ్ర విషాద ఘటన ఒకటి చోటుచేసుకుంది. శానిటైజర్‌ తాగిన ఏడుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని యావత్మల్‌ తహసీల్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరగ్గా.. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో మహారాష్ట్ర సర్కార్ కొవిడ్‌ నిబంధనలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మద్యం అమ్మకాలను నిలిపివేశారు. ఇదే క్రమంలో కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారంతో శానిటైజర్‌‌ను మద్యంగా భావించి తాగడంతో ఆరోగ్యం క్షీణించి మృత్యువాతపడ్డారు.

వని పోలీసు స్టేషన్ పరిధిలోని యావత్మల్‌ తహసీల్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో వీరంతా ప్రాణాల మీదకు తెచ్చకున్నారు. 30 మిల్లీ లీటర్ల శానిటైజర్‌ 250 మిల్లీలీటర్ల మద్యం ఇచ్చే కిక్కు ఇస్తుందని ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని న్యాయవాది దిలీప్‌ పార్చేక్‌ ఆరోపించారు. దీంతో వీరంతా ఐదు లీటర్ల శానిటైజర్‌ కొనుగోలు చేసుకొని శుక్రవారం రాత్రి పార్టీ చేసుకున్నారని, ఆ తర్వాత వాంతులు మొదలయ్యాయన్నారు. వారందరినీ వనిలోని ప్రభుత్వ గ్రామీణ హాస్పిటల్‌లో చేర్పించగా.. పరిస్థితి విషమించి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు.

కాగా, అధికారులకు సమాచారం ఇవ్వకుండానే నలుగురి మృతదేహాలకు బంధువులు అంత్యక్రియలు నిర్వహింయచారరు. మృతుల్లో ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, బంధువలకు అప్పగించామని వని పోలీస్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ వైభవ్‌ జాదవ్‌ తెలిపారు. మృతుల్లో ఐదుగురు 35 ఏళ్లలోపు వారుండగా.. ఇద్దరు 47 ఏళ్లలోపు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు మూడు మరణాలపై కేసు నమోదు చేశామని, మిగిలిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు వైభవ్‌ జాదవ్‌ పేర్కొన్నారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని స్టేషన్‌ ఆఫీసర్‌ వైభవ్‌ జాదవ్‌ వెల్లడించారు.

Read Also….  Lockdown : మే 2 తరువాత ఏ రోజైనా దేశ వ్యాప్తంగా మళ్లీ లాక్‌ డౌన్‌ ప్రకటన ? మోదీ వరుస మీటింగుల సారాంశమిదేనా.?