PUB Drugs Case: పుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో వెలుగులోకి సంచలనాలు.. పోలీసుల చేతికి కస్టమర్ల డాటా!

|

Apr 14, 2022 | 6:55 PM

పుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో సంచలనాలు బయట పడుతున్నాయి. పోలీసుల విచారణలో నిందితులు ఒక్కో విషయాన్ని వెళ్లడిస్తున్నారు

PUB Drugs Case: పుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో వెలుగులోకి సంచలనాలు.. పోలీసుల చేతికి కస్టమర్ల డాటా!
Fooding And Mink Pub Drugs Case
Follow us on

Fooding and Mink Pub: పుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో సంచలనాలు బయట పడుతున్నాయి. పోలీసుల విచారణ(Police Inquiry)లో నిందితులు ఒక్కో విషయాన్ని వెళ్లడిస్తున్నారు. కోర్టు అనుమతితో ప్రధాన నిందితులు అనిల్‌, అభిషేక్‌లను అదుపులోకి తీకున్నపోలీసులు.. పలు అంశాలపై విచారిస్తున్నారు. ఇద్దరి మధ్య ముందే ఫోన్‌ సంభాషణ జరిగినట్టు తేలింది. ఆ ఫోన్‌ కూడా కొకైన్‌ గురించే ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. మేనేజర్‌ అనిల్‌ఫోన్‌లో డ్రగ్స్‌ పెడ్లర్స్‌ నెంబర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారం మేరకు.. కొకైన్‌ ఎవరికి వెళ్లిందనే విషయంపై పోలీసులు ఫోకస్‌ పెట్టారు.

న్యాయస్థానం అనుమతితో నిందితులు ఉప్పల అభిషేక్‌, మేనేజర్‌ అనిల్‌కుమార్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మొదటి రోజు విచరణలో ప్రధానంగా డ్రగ్స్‌పై ఫోకస్‌ పెట్టారు. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు అందజేశారు? ఎప్పటి నుంచి డ్రగ్స్‌ దందా నడుస్తున్నది? ఎంత మంది కస్టమర్లకు డ్రగ్స్‌ సరఫరా చేశారు? అనే ప్రధాన అంశాలపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. దీనిక తోడు.. ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్న సమాచారంపై కూడా ప్రశ్నలు అడినట్టు తెలుస్తోంది.

పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌కు వచ్చే రెగ్యులర్‌ ఖాతాదారుల వివరాలను పోలీసులు సేకరించే క్రమంలో రహస్యంగా నిర్వహించే కస్టమర్ల డాటా కూడా లభ్యమైంది. పబ్‌కు తరుచుగా వచ్చిపోయే వారితో పాటు ఎప్పుడో ఓసారి వచ్చిపోయే ఖాతాదారులున్నట్లు గుర్తించారు. రాడిసన్‌ బ్లూ ఆవరణలో నిర్వహించే ఈ పబ్‌లోకి ఎంట్రీ కావాలంటే పామ్‌ యాప్‌లో 50 వేల నుంచి లక్ష చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో సభ్యత్వం తీసుకున్న వారినే నిర్వాహకులు లోపలికి అనుమతిస్తారు.

అయితే, సభ్యత్వం లేకుండా పబ్బుకు వచ్చే రెగ్యులర్‌ కస్టమర్లు 500 వరకు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అందులో కొందరి వివరాలను ఇప్పటికే సేకరించారు. మిగతావారి వివరాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. అర్ధరాత్రి తరువాత పబ్బు తెరిచి ఉంటుందనే భావనతో వచ్చే కస్టమర్లు కొందరైతే, డ్రగ్స్‌ దొరుకుతుందని, ఆ సమయంలో ఎవరూ పట్టించుకోరనే భావనతో వచ్చే వారు మరికొందరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు సేకరించిన కస్టమర్ల వివరాలు సీసీ పుటేజీలు, కాల్‌ డేటాను క్రోడీకరించి నిందితులను ఆయా అంశాలపై ప్రశ్నించనున్నారు.

Read Also…  Liquor Smuggling: పైన చూస్తే గ్యాస్ సిలిండర్.. కింద చూస్తే ఒపెన్ బార్.. గోనె సంచి తెరిచిన పోలీసులు షాక్!