D Nelaturu Double Murders Story: చెయ్యికి చెయ్యి, తలకి తల. పగకి పగ.. ఇది సినిమా డైలాగ్ అనుకుంటున్నారా? కానే కాదు.. రీల్ సీన్ కాదు, ఇది రియల్ సీన్. కోడల్ని చంపారనే ఆరోపణలు మీద జైల్ కి వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చిన అంజనమ్మ, వరలక్ష్మి అనే తల్లి కుమార్తెలను దారుణంగా హత్య చేసిన ఘటన కడప జిల్లా బ్రహ్మం గారి మఠం మండలంలోని డి నేల టూరు గ్రామంలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ డబల్ మర్డర్ చేసింది ఎవరు? హత్య కి గల కారణాలు ఏంటి? అనే విషయాలపై ఇప్పుడు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
కట్నకానుకులపై దురాశ కక్ష్యలకు ఆజ్యం పోసింది. హత్యల పరంపరను కొనసాగిస్తోంది.. వరకట్నం కోసం నాడు కోడలిని బలితీసుకుంటే.. ఆదే ప్రతికారం నేడు అత్తను వారి బిడ్డను బలితీసుకుంది. ఓ దురాశ ముగ్గరి హత్యలకు దారి తీసిన నేపథ్య ఘటన కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం డి. నేలటూరు పురుడుపోసుకుంది. కోడలి ని జీవసమాధి అయిన ప్రాంతంలో వరకట్నం ఇలా ప్రతీకార స్వేచ్చను రగిలించి దారుణహత్యలకు దారి తీసింది.
బ్రహ్మంగారి మఠం లోని డి.నేలటూరులో డబల్ మర్డర్లు జరిగాయి. నేడు దారుణ హత్యకు గురైన అంజనమ్మ, లక్ష్మిదేవిలు తల్లికూతుళ్లు. వీరిది డి.నేలటూరు స్వగ్రామం. అంజనమ్మ కొడుక్కు తన ఇంటి పక్కన గల రామాంజనేయుల రాజు కుమార్తెను చరీష్మను పెండ్లి చేసుకుంది. తర్వాత కట్నవిషయమై చివరకు కోడలైన చరీష్మను ,అత్త అంజనమ్మ , కొడుకు వెంకటేశ్వరరాజు, కూతురు వరలక్ష్మిమ్మలు 2019 మే నెలలో హత్య చేశారు. వరకట్నం కోసం తన కూతురును అత్త, భర్త, ఆడబిడ్డలు కలసి హత్యచేయడం పై కేసు నమోదు చేయించడమే కాకుండా.. తన కూతురు మృతదేహం అత్త అంజనమ్మ ఇంట్లోనే పూడ్చి సమాధి చేయించారు.
హత్య తర్వాత అంజనమ్మ, కూతురు వరలక్షుమ్మ, కొడుకు వెంకటేశ్వరరాజులు చరిష్మా హత్య కేసులో బెయిల్ రావడంతో బ్రహ్మంగారి మఠంలోనే ఉండిపోయారు. చరిష్మా కేసును రాజీ చేద్దామని కొందరు పెద్ద మనుషులు జోక్యం మేరకు శుక్రవారం డి.నేలటూరులోని తన సొంత ఇంటికి చేరుకున్నారు. ఇది పసిగట్టిన చరిష్మా తండ్రి రామాంజనేయులు రాజు, శ్రీనివాసులు రాజు కలిసి అంజనమ్మను తన కూతురు సమాధి వద్దను హత్య చేసిప్రతీకారం తీర్చుకున్నారు.
చరిష్మా హత్యలో భాగస్వామి అయిన అంజనమ్మ కూతురు వరలక్ష్మిని తన బంధువుల ఇంటి వద్ద ఉండగా మాటు వేసి హత్య చేశారు. చరిష్మా భర్త ప్రస్తుతం పరారీ లో ఉన్నాడు. ఈ జంట మహిళల హత్య ఉదంతం కడప జిల్లాలో పెద్ద అలజడిని రెకెత్తిస్తోంది.
డబుల్ మర్డర్ కేస్ పై ఘటన స్థలాన్ని మైదుకూరు డిఎస్పీ విజయ కుమార్ పరిశీలించి కేస్ నమోదు చేసినట్లు తెలిపారు. గతంలో కోడలు చరిష్మా ని చంపిన నేపథ్యంలో మళ్ళీ బెయిల్ పై ఇంటి కి వచ్చిన అంజనమ్మ, వరలక్ష్మి లను మాటు వేసి చరిష్మా కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు సమాచారంలో తేలిందన్నారు. ప్రస్తుతం హత్య చేసిన వాళ్లు పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకొని మీడియా ముందు హాజరు పరుస్తామని,ప్రస్తుతం కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తూన్నామని మైదుకూరు డిఎస్పీ విజయ్ కుమార్ టీవీ9 కు తెలిపారు.
Read also: Meil: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులను వేగవంతం చేసిన మేఘా