అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గత కొంత కాలంగా సామన్యుల వద్ద నుంచి సేకరించిన ఈ రేషన్ బియ్యంను ఇలా అక్రమ మార్గంలో ఇతర ప్రాంతాలకు తరలిచండం కామన్‌గా మారింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు తాజాగా వీరిని పట్టుకున్నారు. అయితే ఈ సారి కొద్ది మొత్తంలో పట్టుబడినట్లుగా తెలుస్తోంది. సుమారు 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. యాచారం మండలంలో వివిధ గ్రామాలలో రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్న ఓ వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు.
అతని వద్ద నుంచి 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి సీఐ లింగయ్య తెలిపిన ప్రకారం..కడ్తాల్ మండలం పల్లెచెల్క తండాకు చెందిన రాజు అనే వ్యక్తి గ్రామాలలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు తక్కళ్లపల్లి గేటు వద్ద ఆటోను పట్టుకున్నారు. ఆటోలో ఉన్న 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.