హైదరాబాద్ వ్యాపారవేత్త సతీష్ సానాను పాటియాల కోర్టు 5 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు శనివారం ఆయనను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. సాయంత్రం పాటియాల కోర్టులో హాజరుపరిచారు. కేసులో కీలక సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఈడీ 5 రోజుల కస్టడీని కోరింది. ఈ ప్రతిపాదనలు స్వీకరించిన కోర్టు సతీష్ సానాను కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కాకినాడలో విద్యుత్‌శాఖ ఉద్యోగిగా పనిచేసిన సతీష్ సానా.. క్రికెట్ అసోసియేషన్ ద్వారా లబ్ధి పొందిన సానా.. తనకున్న టెక్నికల్ ట్యాలెంట్‌తో.. తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీబీఐ అధికారులతో పరిచయం పెంచుకుని పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలను సీబీఐ సమన్ల నుంచి తప్పించుకునేలా లంచాల బాగోతం కూడా నడిపినట్లు సతీష్‌పై ఆరోపణలున్నాయి. అంతేకాదు మాంసం ఎగుమతులతో పాటు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డాడని సతీష్‌పై ఆరోపణలున్నాయి. మరోవైపు సీబీఐ అధికారులకు లంచం ఇచ్చి సమన్ల నుంచి సతీష్ తప్పించుకోవాలని ప్రయత్నించాడని ఆరోపణలున్నాయి. అయితే ప్రకంపనలు సృష్టించిన సీబీఐ డైరక్టర్, స్పెషల్ డైరక్టర్ బదిలీల వ్యవహారంలో సతీష్ వాగ్మూలం కీలకంగా మారింది.