Andhra Pradesh: ఇంకా మిస్టరిగానే వైజాగ్‌ వివాహిత మిస్సింగ్ కేస్‌.. కానరాని సాయి ప్రియ ఆచూకీ..

|

Jul 27, 2022 | 9:01 AM

Andhra Pradesh: విశాఖపట్నం ఆర్కేబీచ్‌లో కనిపించకుండా పోయినా సాయి ప్రియ ఆచుకీ ఇంకా లభ్యం కాలేదు. గత సోమవారం పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి ఆర్కే బీచ్‌ వెళ్లిన సాయిప్రియ సాయంత్రం...

Andhra Pradesh: ఇంకా మిస్టరిగానే వైజాగ్‌ వివాహిత మిస్సింగ్ కేస్‌.. కానరాని సాయి ప్రియ ఆచూకీ..
Vishaka Missing case
Follow us on

Andhra Pradesh: విశాఖపట్నం ఆర్కేబీచ్‌లో కనిపించకుండా పోయినా సాయి ప్రియ ఆచుకీ ఇంకా లభ్యం కాలేదు. గత సోమవారం పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి ఆర్కే బీచ్‌ వెళ్లిన సాయిప్రియ సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. భర్త శ్రీనివాస్‌తో కలిసి బీచ్‌లో సరదాగా గడిపిన సాయి ప్రియ కొద్దిసేపటికే అదృశ్యమైంది. సముద్రం ఒడ్డున ఫొటోలు దిగుతోన్న సమయంలో తనకు ఏదో మెసేజ్‌ వచ్చిందని బయటకు వచ్చానని, తిరిగి వెనక్కి చూడగానే భార్య కనిపించలేదని శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సాయి పల్లవి ఆచూకీ కోసం వేట ప్రారంభించారు. దాదాపు 36 గంటలుగా సెర్చింగ్ ఆపరేషన్‌ జరుగుతోన్నా ఇప్పటికీ సాయిపల్లవి ఆచూకీ మాత్రం లభించలేదు. సముద్రంలో గల్లంతైందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

ప్రస్తుతం పోలీసులు సాయిప్రియ కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. రెండు హెలికాప్టర్‌లు, కోస్ట్‌ గార్డ్‌ నేవీల సహాయంతో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. త్రీటౌన్‌ పోలీసులతో పాటు మెరైన్‌ పోలీసులు సాయిపల్లవి కోసం వెతుకుతున్నారు. సాయి ప్రియ మిస్సింగ్‌ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సాయి ప్రియ మిస్సింగ్‌ కేసుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత కొన్ని రోజులుగా ఆమె పుట్టింట్లోనే ఉంటుందన్న సమాచారం నేపథ్యం పలు అనుమానాలు దారి తీస్తోంది. సాయి ప్రియ ఆత్మహ్యత చేసుకుందా.? లేదా ఎవరైనా కావాలనే సముద్రంలోకి నెట్టేశారా.? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. మరి ఈ మిస్సింగ్ మిస్టరీకి ఎప్పుడు ఫుల్‌ స్టాప్‌ పడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..