Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆటో సంగం సమీపంలోని బీరాపేరు వాగులో కొట్టుకుపోవడంతో ఐదుగురు అల్లంతయ్యారు. ఆత్మకూరు నుంచి నుంచి సంగంలోని శివాలయంలో నిద్ర చేసేందుకు 12 మంది ఆటోలో బయలుదేరారు. అయితే బీరాపేరు వాగుపై ఉన్న వంతెన దాటుతున్న క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో వాగులో పడిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో ఏడుగురిని పోలీసులు రక్షించగా, మరో ఐదుగురు గల్లంతు అయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాత్రి కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. వాగులోంచి కాపాడిన ఏడుగురిలో ఓ బాలిక పరిస్థితి విషయంగా ఉండటంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి: