Accident in Odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది దుర్మరణం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

Accident in Odisha: ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా కోట్‌పాడ్‌ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నందిగాం సమీపంలో

Accident  in Odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది దుర్మరణం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

Updated on: Feb 01, 2021 | 6:13 AM

Accident in Odisha: ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా కోట్‌పాడ్‌ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నందిగాం సమీపంలో 22 మందితో వెళుతున్న వ్యాన్‌బోల్తీ పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో వాహనంలో 22 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందుస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ పరిధిలో దారుణ ఘటన.. గొంతుకు తాడు బిగించి హత్య.. ఆపై ఏం చేశారో తెలుసా..