లోయలో పడ్డ కారు.. నలుగురు యువకులు మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారు లోయలో పడిన ఘటనలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఖరెగలాలో ఒక బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో యువకులు ప్రాణాలు గాలిలో కలిశాయి.

లోయలో పడ్డ కారు.. నలుగురు యువకులు మృతి

Updated on: Sep 05, 2020 | 11:23 AM

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారు లోయలో పడిన ఘటనలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఖరెగలాలో ఒక బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో యువకులు ప్రాణాలు గాలిలో కలిశాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాకు చెందిన సంగ్లా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఖరెగలాలో ఒక బొలెరో వాహనంలో యువకులు వెళ్తుండగా, అదుపుతప్పిన కారు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంతోనే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు ప్రస్తుతం రామ్‌పుర్ ఖనెరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us