Andhra Pradesh: కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం.. బైక్ చూడండి ఎలా స్ట్రక్ అయ్యిందో..

|

Nov 18, 2021 | 1:18 PM

వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ధ్యాస అంతా డ్రైవింగ్‌పైనే ఉండాలి. పరధ్యానంగా ఉంటే ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది.

Andhra Pradesh: కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం.. బైక్ చూడండి ఎలా స్ట్రక్ అయ్యిందో..
Road Accident
Follow us on

వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ధ్యాస అంతా డ్రైవింగ్‌పైనే ఉండాలి. పరధ్యానంగా ఉంటే ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. ఒక యాక్సిడెంట్ కారణంగా ఎన్నో జీవితాలు రోడ్డున పడాల్సి రావొచ్చు. తాజాగా కృష్ణాజిల్లా నూజివీడు మండలంలోని అన్నవరం వద్ద యాక్సిడెంట్ జరిగింది. మామిడి పరిశోధన స్థానం వద్ద ఆగి ఉన్న లారీని వెనకు నుంచి ద్విచక్రవాహనం నుంది. ఈ ప్రమాదంలో  అన్నవరం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.  క్షతగాత్రులను 108లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ప్రమాదం తర్వాత బైక్ లారీ వెనుక బాగంలో స్ట్రక్ అయి అలా నిటారుగా ఉండిపోయింది. బండి ఉన్న పొజిషన్ చూస్తేనే.. ప్రమాద తీవ్రత అర్థమవుతోంది. గాయపడ్డవారి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరకున్నారు. క్షతగాత్రులకు ఎమర్జెన్సీ విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

 

దుండిగల్​ పరిధిలోని సూరారం కట్టమైసమ్మ చెరువు వద్ద ప్రమాదం

మేడ్చల్ జిల్లా దుండిగల్​ పరిధిలోని సూరారం కట్టమైసమ్మ చెరువు వద్ద బుధవారం అర్ధరాత్రి రోడ్ యాక్సిడెంట్ జరిగింది. గండి మైసమ్మ నుంచి జీడిమెట్ల వైపు వెళ్తున్న కారును వెనక నుంచి ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీలో ఉన్న సామగ్రి కారుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఆ సామగ్రి ఎక్కువ బరువు లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: AP Weather: అల్పపీడనం ఎఫెక్ట్‌‌.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలో 2 రోజులు స్కూళ్లకు సెలవులు

Hyderabad: 29 ఏళ్లకే గుండెపోటుతో యువ డాక్టర్ హఠాన్మరణం.. అది కూడా గాంధీ ఆస్పత్రిలో ఉండగానే