Mobile Apps Cheating: యాప్‌లతో బి కేర్‌ ఫుల్.! RCC ఆన్ లైన్ యాప్‌తో కడప జిల్లాలో 15 కోట్ల రూపాయల మోసం

|

Aug 11, 2021 | 3:39 PM

డబ్బులు ఊరికే రావు అని అందరికి తెలుసు. కానీ ఎలాగోలా, ఎదో ఒక రూపంలో ఫాస్ట్‌గా డబ్బులు సంపాదించాలనే ఆశనే మనిషిని నిలువునా ముంచేస్తుంది. ఈ క్రమంలోనే ఒక ఆన్ లైన్ షాపింగ్ యాప్‌లో

Mobile Apps Cheating: యాప్‌లతో బి కేర్‌ ఫుల్.! RCC ఆన్ లైన్ యాప్‌తో కడప జిల్లాలో 15 కోట్ల రూపాయల మోసం
Mobile Apps
Follow us on

RCC App Cheating: డబ్బులు ఊరికే రావు అని అందరికి తెలుసు. కానీ ఎలాగోలా, ఎదో ఒక రూపంలో ఫాస్ట్‌గా డబ్బులు సంపాదించాలనే ఆశనే మనిషిని నిలువునా ముంచేస్తుంది. ఈ క్రమంలోనే ఒక ఆన్ లైన్ షాపింగ్ యాప్‌లో గ్రాబింగ్ చేస్తే ప్రతి రోజు కమీషన్ రూపంలో ఊరికే డబ్బులు వస్తాయని ఆశపడ్డారు. కొన్ని కోట్ల రూపాయలను.. కొన్ని వందల మంది మోసపోయారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఇంతకీ ఇన్ని వందల మంది ఎలా మోసపోయారు? ఆ ఆన్ లైన్ యాప్ ఏంటో చుద్దాం?

కడప జిల్లా కేంద్రంగా RCC అనే ఆన్ లైన్ యాప్‌లో షాపింగ్ గ్రాబింగ్ ద్వారా పెద్ద మోసం జరిగింది. అదేదో ఒక లక్ష, రెండు లక్షలు కాదు. సుమారు 15 కోట్ల రూపాయలు పైగా స్కామ్. మోసపోయిన బాధితులు దాదాపు1000 మందికి పైగా ఉంటారని తెలుస్తోంది. నిరుద్యోగులను టార్గెట్ చేసుకొని చేసిన మోసం ఇదంతా. జిల్లాలోని మైదుకూరులో కొందరు యువకులు ఉద్యోగం కోసం గూగుల్ సెర్చ్ చేస్తూ ఉండగా ఈ ఆన్ లైన్ RCC యాప్ వెలుగులోకి వచ్చింది.. మొదట కొందరు కాల్ చేసి ఆర్సీసీ ఆన్ లైన్ యాప్ గురించి వివరించి దాని నుంచి వచ్చే ఆదాయాలు అన్ని వివరించి, వారికి వాట్సప్ ద్వారా ఒక లింక్ పంపారు. దానిని డౌన్ లోడ్ చేసుకున్న వారు మరికొందరికి షేర్ చేయడంతో బాధితులు ఎక్కువ అయ్యారు. అయితే ఈ RCC అనే ఆన్ లైన్ యాప్ ఎలా పనిచేస్తుంది.. దాన్ని ఎలా వాడతారో ఓసారి చుద్దాం.

ముందుగా RCC ఆన్ లైన్ యాప్‌ని లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొని మొబైల్ నెంబర్‌తో లాగిన్ కావాలి. లాగిన్ అయ్యాక మొదటి స్టేజ్‌లో 3000 రూపాయలతో రీచార్జి చేసుకోవాలి. ఆ 3000 రూపాయలతో యాప్‌లో ఉన్న షాపింగ్‌లో ఉన్న వస్తువులు పై ఒక క్లిక్ చేస్తే చాలు. ఆటోమాటిక్ గా కమీషన్ వాళ్ళ అకౌంట్‌లో యాడ్ అవుతుంది. ఇందులో 3000 నుంచి 6 లక్షల వరకు కూడా రీచార్జి చేసుకునే వీలుంది. ఎక్కువ రీచార్జి చేస్తే, ఆదాయం ఎక్కువగా వస్తుందని, ఎక్కువ ఆదాయం సంపాదించుకోవచ్చు అని ఆశ చూపిస్తారు. దీనితో ఎక్కువ ఆదాయం కావాలనే ఉద్దేశ్యంతో పెద్ద మొత్తంలో బాధితులు రీచార్జి చేసుకొని ఉన్నారు.

ఇలా ప్రతి రోజు షాపింగ్ గ్రాబింగ్ చేసి క్లిక్ చేస్తే కమీషన్ రూపంలో మనం రీచార్జి చేసుకున్న అమౌంట్‌కి డబ్బులు యాడ్ అవుతూ ఉండడాన్ని చూసి నిజమని చాలా మంది బాధితులు నిజం అని నమ్మారు. ఇదే చాలా మంది బాధితులు నమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బులు రీచార్జి చేసుకుని పక్కన ఉన్న స్నేహితులుకి రిఫర్ చేసారు. ఫ్రెండ్స్‌కి రిఫర్ చేసినందుకు కమీషన్ ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పడంతో ఇది ఒక 10 మంది నుంచి 1000 మంది బాధితులుగా మారిపోయారు. ఇది కడప జిల్లా మొత్తం ఒక చైన్ సిస్టంలా మారిపోయింది.

అయితే కొన్ని రోజుల వరకు బాగానే కమీషన్ వస్తూనే ఉన్నా, సడెన్‌గా కమీషన్ రాకపోవడంతో పాటు వాళ్ళ రీచార్జి చేసుకున్న అమౌంట్ విత్ డ్రా చేసుకోవడానికి వీలు కాకపోవడంతో మోసపోయారని అర్థమై, RCC ఆన్ లైన్ కాంటాక్ట్ పర్సన్స్‌ని అడగడంతో మధ్యలో కట్టిన డబ్బుల కంటే రెట్టింపు డబ్బులు కడితే తప్ప మీ కమీషన్లు గానీ, అసలు డబ్బు గానీ ఇవ్వమని చెప్పడంతో బాధితులు కంగుతిన్నారు. మోసపోయామని తెలుసుకుని తమకు న్యాయం చేయమని జిల్లా ఎస్పీ అన్బురాజన్ని కలిసి ఫిర్యాదు చేసారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

దీనిపై జిల్లా ఎస్పీ అన్బు రాజన్‌ని టీవీ9 వివరణ కోరగా దీనిపై ఫిర్యాదు అందిందని కేసు కూడా నమోదు చేశామని టీవీ9తో తెలిపారు. ఇలాంటి ఆన్ లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం RCC యాప్ లో ఉన్న ఐపి అడ్రెస్ ద్వారా ట్రేస్ చేస్తున్నామని, ఒక్క మైదుకూరులోనే కాక ఇతర జిల్లాల్లో ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారని తెలుస్తోందని అన్నారు. ప్రస్తుతం ప్రత్యేక టీంలతో దర్యాప్తు చేస్తున్నామని టీవీ9 తో జిల్లా ఎస్పీ అన్బురాజన్ అన్నారు.

సేరి సురేష్, టీవీ9 ప్రతినిధి, కడప జిల్లా

Read also: Vizianagaram MPDO ఆఫీస్‌లో రగులుతోంది మొగలిపొద అంటూ రగిలిపోయారు