బిహార్‌లో దారుణం.. మూగబాలికపై అఘాయిత్యం.. గుర్తుపట్టకూడదని కళ్లల్లో పొడిచిన దుండగులు..

Latest Crime News: దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, యువతులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్లు

బిహార్‌లో దారుణం.. మూగబాలికపై అఘాయిత్యం.. గుర్తుపట్టకూడదని కళ్లల్లో పొడిచిన దుండగులు..

Updated on: Jan 14, 2021 | 8:46 AM

Latest Crime News: దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, యువతులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకున్న కొంతమంది చిన్నా పెద్దా తేడా లేకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. సభ్యసమాజానికి తలవొంపులు తీసుకొస్తున్నారు. తాజాగా బిహార్‌లో ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూగ బాలికపై అత్యాచారం చేసి అత్యంత హేయంగా ఆమె కళ్లను పొడిచేసారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బిహార్‌ రాష్ట్రం మధుబని జిల్లా కవాహ బర్హి గ్రామానికి చెందిన మూగ, చెవిటి బాలిక రోజూ వారీగా మేకలను మేపేందుకు వెళ్లింది. ఎప్పటి నుంచో ఆమెపై కన్నేసిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహికంగా లైంగిక దాడి చేసి అనంతరం వారిని గుర్తు పట్టకూడదని ఆమె కళ్లను పొడిచేసారు. దీంతో బాలికతో ఉన్న మరొకరు విషయాన్ని ఆమె ఇంటికి వెళ్లి చెప్పారు. వారు వచ్చేసరికి ఆ బాలిక బీడు భూమిలో పడి బాధతో విలవిలలాడుతోంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆమె కంటిచూపును కాపాడేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు. కాగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.

ప్రేమ పేరుతో మ్యూజిక్ టీచర్‌ను మోసం చేసిన కామాంధుడు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో..

Road Accident: వివాహానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం.. నలుగురికి తీవ్ర గాయాలు

Loading...
Unable to load recommendations.
Follow Us