Women Trafficking : అమాయక మహిళలే వాళ్ల టార్గెట్. ట్రావెల్ ఏజెన్సీ ముసుగులో సాగుతున్న ఇంటర్నేషనల్ దందా గుట్టువిప్పారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. ట్రావెల్ ఏజెన్సీ ముసుగులో చట్ట విరుద్ధంగా మహిళలను అరబ్ దేశాలకు పంపుతున్న అల్ హయత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమానితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అంతరాష్ట్ర ట్రావెల్ ఏజెంట్లను అరెస్ట్ చేశారు.
ఓ ఏజెంట్ అనుమానాస్పదపు ప్రవర్తన.. అరబ్ దేశాలకు మహిళల అక్రమ రవాణా గుట్టును బయటపెట్టింది. ఒక రాత్రి నాతో గదిలో ఉండాలనే మాటతో అప్రమత్తమైన మహిళ ఏజెంట్‌ల బారి నుంచి తప్పించుకుని రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. దీంతో మేడిపల్లి, రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా చేసిన దర్యాప్తులో అల్ హయత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముసుగులో నడుస్తున్న మనుషుల అక్రమ రవాణా రహస్యాన్ని బహిర్గతం చేశారు.
బతుకుతెరువుకోసం దూరభారమైనా వెళ్లేందుకు సిద్ధపడే నిస్సహాయులకు అద్భుత అవకాశాలున్నాయని ఎరవేస్తున్నాయి కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు. అల్‌హయత్ సాగిస్తున్న దందా ఇదే. మహిళలను ట్రాప్‌లో ఇరికించి.. విమాన మెక్కిస్తున్నారు. తర్వాత వారి గోడు పట్టించుకునేవారుండరు. దేశంకాని దేశంలో వేధింపులతో బతకాల్సిందే.
మళ్లీ తిరిగొస్తారనే నమ్మకం కూడా ఉండదు. చీటింగ్ ట్రావెల్స్ ముఠా బారినుంచి మేడిపల్లికి చెందిన ఓ మహిళను రక్షించారు పోలీసులు. క్రాస్‌చెక్ చేసుకోకుండా బోగస్ ట్రావెల్స్‌ని నమ్ముకుంటే.. నిలువునా వంచిస్తారని హెచ్చరిస్తున్నారు రాచకొండ సీపీ మహేష్‌భగవత్.
డబ్బుకోసం అమయాకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అక్రమ రవాణాతో ఏజెంట్లు జేబులు నింపుకుంటున్నారు. విమానమొక్కిస్తే చాలు కమీషన్ ముడుతోంది. అందుకే ఇలాంటివారి మాయమాటలు నమ్మి మోసపోవద్దంటున్నారు పోలీసులు. అక్రమ ట్రావెల్ ఏజెన్సీ నుంచి 40 పాస్‌పోర్టులతో పాటు… 6వేల నగదు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కి తరలించారు. స్పెషల్ ఆపరేషన్ టీంతో పాటు ఎల్బీనగర్ పోలీసులు.. ఈ ముఠా గుట్టురట్టుచేశారు.
The sleuths of #SpecialOperationTeam, LB Nagar Zone of #RachakondaCommissionerate nabbed 4 interstate #HumanTraffickers including recruiting agent and #rescued a woman victim being #trafficked to #Muscat, #Oman Country.@TelanganaDGP @TelanganaCOPs @RaoKavitha @DrTamilisaiGuv pic.twitter.com/SArkzEttw8
— Rachakonda Police (@RachakondaCop) February 9, 2021
Uttarakhand floods: ఉత్తరాఖండ్ జలప్రళయం.. 32కి చేరిన ప్రాణ నష్టం.. ముమ్మరంగా సహాయక చర్యలు
తొలి విడత పంచాయతీ పోరులో ఫ్యాన్‌దే జోరు.. వైఎస్సార్‌సీపీ అభిమానుల విజయ భేరి