బ్రేకింగ్ః కృష్ణా న‌దిలో మునిగిన పుట్టి.. న‌లుగురు గ‌ల్లంతు

కృష్ణా న‌దిలో ఓ పుట్టి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో న‌లుగురు గ‌ల్లంతు అయ్యారు. వివ‌రాల్లోకి వెళ్తే.. నారాయ‌ణ‌పేట జిల్లా ప‌రిధిలోని మ‌క్త‌ల్ మండ‌లం పంచ‌దేవ‌ల ప‌హాడ్ నుంచి మూడు పుట్టిల్లో కూలీలు క‌ర్ణాట‌క రాష్ట్ర రాయ్‌చూర్‌లోని కుర‌వాపురం గ్రామానికి వెళ్తుండ‌గా..

బ్రేకింగ్ః కృష్ణా న‌దిలో మునిగిన పుట్టి.. న‌లుగురు గ‌ల్లంతు

Edited By:

Updated on: Aug 17, 2020 | 6:41 PM

కృష్ణా న‌దిలో ఓ పుట్టి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో న‌లుగురు గ‌ల్లంతు అయ్యారు. వివ‌రాల్లోకి వెళ్తే.. నారాయ‌ణ‌పేట జిల్లా ప‌రిధిలోని మ‌క్త‌ల్ మండ‌లం పంచ‌దేవ‌ల ప‌హాడ్ నుంచి మూడు పుట్టిల్లో కూలీలు క‌ర్ణాట‌క రాష్ట్ర రాయ్‌చూర్‌లోని కుర‌వాపురం గ్రామానికి వెళ్తుండ‌గా న‌ది దాటే క్ర‌మంలో ఓ పుట్టి నీటిలో మునిగింది. వీరంతా కిర‌ణా సామాన‌ట్లు కొనుగోలు చేసుకుని వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు సమాచారం. పసుపుల వ‌ద్ద‌కు రాగానే ప‌ట్టి ప‌ల్టీ కొట్ట‌డంతో అంద‌రూ నీటిలో మునిగిపోయారు. వెంట‌నే మ‌రో పుట్టిలోని ప్రయాణికులు అప్ర‌మ‌త్త‌మై కొంత‌మందిని సుర‌క్షితంగా ర‌క్షించి ఒడ్డుకు చేర్చ‌గా.. మ‌రో న‌లుగురు గల్లంతు అయ్యారు. గ‌ల్లంతు అయిన వారిలో ఓ చిన్న పాప కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం వారి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు అధికారులు.

Read More:

మ‌ళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధ‌ర‌లు

బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

భారీ వ‌ర్షాల‌కు కూలిన రోడ్డు.. లోయ‌లో ప‌డిన వాహ‌నాలు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం