క్లాస్‌రూమ్‌లోనే ఎంతకు తెగించావ్‌రా.. అమ్మాయిలతో మాట్లాడుతూనే..

పంజాబ్‌ తరన్‌ తారన్‌ ‌ లా కాలేజ్‌లో దారుణం జరిగింది. లేడీ స్టూడెంట్‌ను క్లాస్‌ రూమ్‌ లోనే కాల్చిచంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తరువాత తనను తాను గన్‌తో కాల్చుకున్నాడు . తోటి విద్యార్ధుల ముందే ఈ దారుణం జరిగింది. క్లాస్‌ ప్రారంభం ముందు ఆ విద్యార్ధిని దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు ఆ విద్యార్ధి తరువాత కాసేపు మాట్లాడాడు.

క్లాస్‌రూమ్‌లోనే ఎంతకు తెగించావ్‌రా.. అమ్మాయిలతో మాట్లాడుతూనే..
Punjab Crime News

Updated on: Feb 09, 2026 | 2:05 PM

పంజాబ్‌ తరన్‌ తారన్‌ ‌ లా కాలేజ్‌లో దారుణం జరిగింది. లేడీ స్టూడెంట్‌ను క్లాస్‌ రూమ్‌ లోనే కాల్చిచంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తరువాత తనను తాను గన్‌తో కాల్చుకున్నాడు . తోటి విద్యార్ధుల ముందే ఈ దారుణం జరిగింది. క్లాస్‌ ప్రారంభం ముందు ఆ విద్యార్ధిని దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు ఆ విద్యార్ధి తరువాత కాసేపు మాట్లాడాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు.. కానీ.. బ్యాగ్‌ లో నుంచి గన్‌ తీసి కాల్పులు జరిపాడు.. తరువాత తనను తాను కాల్చుకున్నాడు. సీసీటీవీలో కాల్పుల దృశ్యాలు రికార్డయ్యాయి.

కాల్పుల ఘటన సమయంలో చాలామంది విద్యార్ధులు క్లాస్‌ రూమ్‌లో ఉన్నారు. తొలుత అమ్మాయిని చంపి.. తరువాత గన్‌ను లోడ్‌ చేసి తనను కాల్చుకొని చనిపోయాడు విద్యార్థి.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వివరాలను సేకరించి.. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

విద్యార్ధిని పేరు సందీప్‌ కౌర్‌ కాగా.. ఆమెను కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్‌ పేరు ప్రిన్స్‌ రాజ్‌ గా పోలీసులు తెలిపారు. సందీప్‌ కౌర్‌ను ప్రిన్స్‌రాజ్‌ కాల్చిచంపి చనిపోవడానికి కారణం ప్రేమ వ్యవహారమేనని పోలీసులు భావిస్తున్నారు.

అయితే 19 ఏళ్ల విద్యార్ధి దగ్గర గన్‌ ఎలా వచ్చిందన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. పంజాబ్‌లో గన్‌కల్చర్‌కు ఈ హత్య నిదర్శనమని ఆప్‌ సర్కార్‌పై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..