AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటేస్తే మీ ఆయుష్షు పెరుగుతుందండోయ్.! నిజమే నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్

ఓటు అనేది ఒక వ్యక్తి ప్రాథమిక హక్కు. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెబుతుంటారు. ఇక ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ముఖ్యంగా వృద్ధులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఓటు వేస్తారు. తమ ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకుంటారు. ఇక ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఓటు వేస్తే ఆయువు పెరుగుతుందంట. అది ఎలా అనుకుంటున్నారా? అయితే ఇలా తెలుసుకోండి!

Samatha J
|

Updated on: Apr 24, 2026 | 3:04 PM

Share
ఓటింగ్, ఆయుర్దాయం మధ్య ఒక స్పష్టమైన సంబంధం ఉందని ఒక అధ్యయనంలో వెళ్లడి అయ్యింది. పరిశోధనల ప్రకారం ఓటు వేయని వారి కంటే ఓటు వేసేవారు ఎక్కువ కాలం జీవిస్తారని, ఓటు వేసేవారు మరణించే సమయం చాలా వరకు తగ్గుతుందని ఈ సర్వేలో వెళ్లడి అయ్యింది. అంటే ఒక వ్యక్తి ఓటు వేయడం వలన ఎక్కువ కాలం జీవించే ఛాన్స్ ఉన్నదంట. స్కూల్ ఆఫ్ సోషల్ పాలసీ, అండ్ ప్రాక్టీస్‌కు చెందిన ఫెమిడా హ్యాండీ, సారా కొన్రాత్‌ల సహాకారంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో ఓటు ప్రయోజనాలు వెళ్లడి అయ్యాయి. ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ప్రయోజనమే కాకుండా, ఇది ఒక వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నదంట. ఓటు వేయడం వలన ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, తన జీవన ప్రమాణ రేటు కూడా పెరుగుతుందంట.

1 / 5
ఓటు హక్కును వినియోగించుకునేవారు అనేక విధాలుగా ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉంటుందంట. ముఖ్యంగా వీరికి ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుందంట.  జర్నల్ ఆఫ్ జెరోంటాలజీ సైకలాజికల్ స్టడీస్‌లో ప్రచురించిన అధ్యయనంలో 2008లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసి వృద్ధులను, ఓటు వేయని వృద్ధులను పరిశీలించి వారిని సర్వే చేయగా, వారిలో ఓటు వేయని వారితో పోలిస్తే ఓటు వేసిన వారిలో మరణ ప్రమాదం  చాలా తక్కువగా ఉన్నట్లు తేలిందంట.

2 / 5
ఎన్నికల్లో ఓటు వేసిన, ఓటు వేయని వారిని దాదాపు ఐదు, నుంచి పది , పదిహేను సంవత్సరాల పాటు పరిశీలించగా, వారిలో ఓటు వేసిన వారిలో దీర్ఘకాలంలో మరనించే అవకాశం చాలా తక్కువగా ఉందని పరిశోధనలో తేలిందని వారు తెలియజేశారు.  ముఖ్యంగా దూరంగా ఉండి ఓటు వేసినప్పటికీ, అభ్యర్థి ఓడిపోయిన సందర్భాల్లో కూడా ఈ ప్రయోజనాలు మాత్రం సమానంగా ఉన్నాయంట. ఓటు ఎవరికి వేశారు? ఎలా వేశారు? ఇవన్నింటి కంటే ఒక వ్యక్తి ఓటు వేయడమే అతని ఆరోగ్యానికి చాలా మంచిదని వారు తెలియజేశారు.

3 / 5
అయితే ఈ ఓటు వేయడం అనేది ఆరోగ్యంతో ఉన్నవారికి మాత్రమే కాదండోయ్, అనారోగ్యంతో ఉన్నవారికి మరింత ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చిందని పరిశోధకులు పేర్కొనడం జరిగింది. అనారోగ్యంతో బాధపడే వారు ఓటు వేయడం వలన ఎక్కువ ప్రయోజనాలు అందుకున్నారంట. ప్రజాస్వామ్యంలో పాలు పంచుకోవడం, ప్రజలలో కలిసి ఉండటం, తాము ఒక సముహానికి చెందిన వారమనే భావన ఇవన్నీ కూడా వారి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపాయంట. ఇవి మానసిక ప్రశాంతతను కలిగించి, అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగించాయని చెబుతున్నారు నిపుణులు.

4 / 5
అదే విధంగా ఓటు వేసిన వారిలో హృదయ సంబంధ వ్యాధులు తగ్గడం, మానసిక ఆరోగ్యం మెరుగు పడటం జరిగిందని వారు తెలియజేశారు. అలాగే ఓటు వేసే  క్షణంలో వారు ఆనందంగా ఉండటం వలన అది వారి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. దీంతో వారి ఆయువు రేటు అనేది పెరుగుతుందని వారు పరిశోధనల ద్వారా తెలియజేశారు. నోట్ : పై సమాచారం కేవలం నిపుణుల సమాచారం మేరకు, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరిచలేదని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us