వేసవిలో పెరుగుతో కీరదోస  కలిపి తింటే ఏమవుతుంది?

24 April 2026

TV9 Telugu

TV9 Telugu

చాలా మందికి పెరుగుతో తిన‌నిదే అస‌లు భోజ‌నం చేసిన‌ట్టుగా ఉండ‌దు. పెరుగు మ‌న శ‌రీరానికి చ‌లువ చేయ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది

TV9 Telugu

ముఖ్యంగా జీర్ణ‌క్రియ‌కు పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో ఉండే ప్రోబ‌యాటిక్స్ జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి

TV9 Telugu

చాలా మంది గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అలాంటి వారికి పెరుగు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. పెరుగులో ఉండే ప్రోబ‌యాటిక్స్ గ్యాస్ ల‌క్ష‌ణాల‌ను త‌గ్గిస్తుంది

TV9 Telugu

అయితే వేసవిలో పెరుగుతో కలిపి కీరదోస తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కలయిక శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందట

TV9 Telugu

పెరుగులోని ప్రోబయోటిక్స్, దోసలోని పీచుపదార్థం కలిసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించి, కడుపు తేలికగా ఉండేలా చేస్తుంది

TV9 Telugu

పెరుగు, దోసకాయ రెండింటికీ చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. వీటిని కలిపి తినడం వల్ల శరీరం చల్లబడి, వడదెబ్బ ప్రభావాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది

TV9 Telugu

కీరదోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పెరుగు పోషణను అందిస్తుంది. ఇవి రెండూ కలిసి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడతాయి. పెరుగు, దోసలో కేలరీలు తక్కువగా ఉంటాయి . ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది

TV9 Telugu

వీటిని తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీంతో అతిగా తినడాన్ని నివారిస్తుంది. వీటిల్లోని పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి. చర్మాన్ని తేమగా ఉంచి శుభ్రంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి