వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది శీతల పానియాలు తాగుతుంటారు. అలాగే నిమ్మరసం (నీంబూ పానీ), చల్లని లస్సీలు, చెరకు రసం వంటి సంప్రదాయ పానీయాలు తక్షణ ఉపశమనం ఇస్తాయి
TV9 Telugu
ఇది సహజంగా తీయగా, తాజాగా అనిపించడంతోపాటు శరీరాన్ని చల్లబరుస్తుందని చాలామంది నమ్మకం. అయితే తీవ్రమైన ఎండలో ఇది నిజంగా హీట్ స్ట్రోక్‌ను నివారిస్తుందా? హైడ్రేషన్‌ను అందిస్తుందా? వంటి కొన్ని అపోహలు ఉన్నాయి
TV9 Telugu
చెరకు రసం తాగితే చల్లగా అనిపించినా, ఇది హీట్ స్ట్రోక్‌ను నివారించడానికి అవసరమైన ముఖ్య పోషకాలను అందించదు. చెరకు రసం ఎలక్ట్రోలైట్ డ్రింక్‌లా పనిచేస్తుందని ఒక పెద్ద అపోహ ఉంది
TV9 Telugu
వాస్తవానికి చెమట ద్వారా శరీరం ఒక లీటర్‌కు సుమారు 900 మిల్లీగ్రాముల సోడియంను కోల్పోతుంది. కానీ ఒక గ్లాస్ చెరకు రసంలో కేవలం 11 నుంచి 17 మిల్లీగ్రాముల సోడియం మాత్రమే ఉంటుంది
TV9 Telugu
సోడియం శరీరంలో నీటిని నిల్వ ఉంచడంలో కీలకం. ఇది తక్కువగా ఉంటే హైడ్రేషన్ పూర్తిగా జరగదు. అందుకే చెరకు రసం తాగడం అంటే అసలు శరీరాన్ని హైడ్రేట్ చేయడం కాకుండా చక్కెర నీరు తాగినట్లే అవుతుందని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
దీనికంటే కొంచెం ఉప్పు కలిపిన నిమ్మరసం తాగడం ఎంతో మేలు చేస్తుంది. ఒక గ్లాస్ చెరకు రసంలో సుమారు 25 నుంచి 40 గ్రాముల వరకు చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచే ప్రమాదం ఉంది
TV9 Telugu
ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగితే ఇది మరింత ప్రభావం చూపుతుంది. తాత్కాలికంగా శక్తి ఇచ్చినా, దీర్ఘకాలికంగా హైడ్రేషన్‌కు పెద్దగా సహాయపడదు. హైజీన్ కూడా చెరకు రసం విషయంలో పెద్ద సమస్యగా మారుతుంది
TV9 Telugu
బదులుగా నిమ్మరసం, కొంచెం ఉప్పు కలిపితే శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందుతాయి. శరీరంలో నీటిని నిల్వ ఉంచేలా సహాయపడే పానీయాలపై దృష్టి పెట్టడం అవసరం