Encounter: వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్య కేసులో పురోగతి… కీలక నిందితుడు వికాస్‌ అలియాస్‌ రాజా ఎన్‌కౌంటర్‌

బిహార్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్‌ ఖేమ్కా హత్య కేసులో కీలక నిందితుడు వికాస్‌ అలియాస్‌ రాజా పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. గోపాల్ ఖేమ్కా హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్‌ బృందం.. కీలక నిందితుడైన వికాస్‌ కోసం గాలింపు చేపట్టింది. పాట్నాలోని ఓ ప్రాంతంలో సోదాలు...

Encounter: వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్య కేసులో పురోగతి... కీలక నిందితుడు వికాస్‌ అలియాస్‌ రాజా ఎన్‌కౌంటర్‌
Bihar Encounter

Updated on: Jul 08, 2025 | 10:01 AM

బిహార్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్‌ ఖేమ్కా హత్య కేసులో కీలక నిందితుడు వికాస్‌ అలియాస్‌ రాజా పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. గోపాల్ ఖేమ్కా హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్‌ బృందం.. కీలక నిందితుడైన వికాస్‌ కోసం గాలింపు చేపట్టింది. పాట్నాలోని ఓ ప్రాంతంలో సోదాలు జరుపుతుండగా.. నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. ఎదురుకాల్పుల్లో నిందితుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

అక్రమ ఆయుధాల తయారీ, విక్రయాలతో వికాస్‌ అలియాస్‌ రాజాకి సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు గోపాల్ ఖేమ్కా హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మగధ హాస్పిటల్ యజమాని, వ్యాపారవేత్త గోపాల్‌ఖేమ్కా పాట్నాలో శుక్రవారం హత్యకు గురయ్యారు. హోటల్‌ నుంచి బయటికి వస్తుండగా నిందితులు పాయింట్‌బ్లాంక్‌ రేంజ్‌లో ఆయనపై కాల్పులు జరిపారు.

మరికొన్ని నెలల్లో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ హత్య రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపింది. గోపాల్‌ ఖేమ్కా తనయుడు గుంజన్‌ ఖేమ్కా కూడా గతంలో హత్యకు గురయ్యారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రత్యర్థులకు టార్గెట్‌ కావటంతో పాటు విపక్షాల విమర్శలతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.