Suicide: విశాఖలో తీవ్ర విషాదం.. ఆరేళ్ల కొడుకును చంపి.. తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రైవేట్ స్కూల్ టీచర్.. సూసైడ్ నోట్‌లో ఏముంది?

విశాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ళ కొడుకుని చంపి.. తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ కన్నతల్లి. ఆర్ధిక ఇబ్బందులే కారణమని సూసైడ్ నోట్ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడిందని విశాఖ పోలీసులు తెలిపారు.

Suicide: విశాఖలో తీవ్ర విషాదం.. ఆరేళ్ల కొడుకును చంపి.. తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రైవేట్ స్కూల్ టీచర్.. సూసైడ్ నోట్‌లో ఏముంది?
Suicide

Updated on: Apr 23, 2021 | 7:22 AM

School Teacher Suicide: విశాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ళ కొడుకుని చంపి.. తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ కన్నతల్లి. ఆర్ధిక ఇబ్బందులే కారణమని సూసైడ్ నోట్ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడిందని విశాఖ పోలీసులు తెలిపారు. ఈ ఘటన మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీ జరిగింది.

శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన సరిత కుటుంబం 2015లో విశాఖపట్నం వచ్చి స్థిరపడింది. మారిక వలస రాజీవ్ గృహ కల్ప కాలనీలో నివాసముంటున్న సరిత ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలు. భర్తకు హోటల్ బిజినెస్‌లో లాస్ రావడంతో మరో హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, వ్యాపారానికి సంబంధించి నష్టాలు రావడం, ఇందుకు కోసం చేసిన అప్పులు తీర్చలేకపోవడంతో భార్య, భర్తల మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్ధలు వచ్చాయి.

ఇదే క్రమంలో మనస్తాపానికి గురైన సరిత తనువు చాలించాలని నిర్ణయించుకుంది. దీంతో తన ఆరేళ్ల కొడుకును చంపి.. తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సరిత రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also…  Medical Oxygen: ప్రాణ వాయువు కోసం పరితపిస్తున్న కరోనా బాధితులు.. ఆక్సిజన్ కోసం విశాఖ కేజీహెచ్ అధికారులు వినూత్న ప్రయోగం