పూజారే నిందితుడు.. , నిత్యం పూజలు చేసే చేతులతోనే విగ్రహం చేతులను ధ్వంసం చేశాడట.!

మొత్తానికి పూజారే నిందితుడని తేల్చారు. నిత్యం పూజలు చేసే చేతులతోనే విగ్రహం చేతులను ధ్వంసం చేశాడట.. అసలు పూజారికి విగ్రహం ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది ?..

పూజారే నిందితుడు.. ,  నిత్యం పూజలు చేసే చేతులతోనే విగ్రహం చేతులను ధ్వంసం చేశాడట.!

Updated on: Feb 01, 2021 | 3:56 AM

మొత్తానికి పూజారే నిందితుడని తేల్చారు. నిత్యం పూజలు చేసే చేతులతోనే విగ్రహం చేతులను ధ్వంసం చేశాడట.. అసలు పూజారికి విగ్రహం ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది ? అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అయి కూర్చుంది. రాజమండ్రిలో జరిగిన విగ్రహాల ధ్వంసం కేసులో కొత్త కోణం బయట పెట్టారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని శ్రీరామ్‌నగర్‌ విఘ్నేశ్వరాలయంలోని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని పూజరే ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. జనవరి 1వ తేదీన జరిగిన ఈ ఘటనపై అర్భన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిట్‌ విభాగంతో కలిసి మొత్తం 8 బృందాలు దర్యాప్తు చేపట్టాయి.

ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారణ జరిపారు పోలీసులు. అయితే ఆలయంలో పనిచేసే పూజారి వెంకటమురళికి ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో వాటిని ఆధారంగా చేసుకుని కొందరు 30 వేల ఆశచూపి, ఆయనతో విగ్రహాన్ని ధ్వంసం చేయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఆలయ పూజారి మరల వెంకట మురళికృష్ణతో పాటు మల్ల వెంకటరాజు. దంతులూరి వెంకటపతిరాజు అనే ముగ్గురిని అరెస్ట్‌ చేశారు . రాజకీయ లబ్ది పొందాలనే ఉద్దేశంతో కొంత మంది వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్టు నిర్థారణకు వచ్చామని సిట్‌ డిఐజీ తెలిపారు. ఈ కేసు విచారణ ఇక్కడితో పూర్తి కాలేదని ఇంకా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో జరిగిన వివిధ కేసుల విచారణను కూడా వెల్లడిస్తామన్నారు.