శిరోముండనం కేసులో రాష్ట్రపతి మరో కీలక నిర్ణయం

|

Aug 19, 2020 | 2:57 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో సంచలనం రేపిన శిరోముండనం కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. కేసుపై రాష్ట్రపతి కార్యాలయం మరోసారి స్పందించింది.

శిరోముండనం కేసులో రాష్ట్రపతి మరో కీలక నిర్ణయం
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో సంచలనం రేపిన శిరోముండనం కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. కేసుపై రాష్ట్రపతి కార్యాలయం మరోసారి స్పందించింది. రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించినప్పటికీ తన కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయం జరగడం లేదని, తన గోడును పట్టించుకోవడం లేదని వరప్రసాద్‌ మరోసారి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.దీంతో రాష్ట్రపతి కోవింద్‌ వెంటనే స్పం దించారు. ఈ కేసును తక్షణం విచారించేలా కేంద్ర సామాజిక న్యాయశాఖను ఆదేశించారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన ఫైలును సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును అత్యవసర కేసుగా పరిగణించి విచారణ చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలికి చెందిన ఇండుగిమిల్లి వరప్రసాద్‌ శిరోముండనం కేసులో తనకు న్యాయం జరగట్లేదని, నక్సలైట్లలో చేరడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతికి ఇటీవలే లేఖ రాశారు. దీంతో రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం సహాయ కార్యదర్శి జనార్దన్‌బాబుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. తాజాగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు కేసును బదిలీ చేస్తున్నట్లు తెలిపే ఉత్తర్వులు మంగళవారం రిజిస్టర్‌ పోస్టులో అందాయని వివరించారు. ఈ కేసును అత్యవసర విషయంగా పరిగణించాలని రాష్ట్రపతి కార్యదర్శి అశోక్‌కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారన్నారు