Student death: ప్రకాశం జిల్లాలో విషాదం.. స్కూల్ పైకప్పు కూలి విద్యార్థి మృతి..!

పాఠశాల పైకప్పు కూలి ఓ చిన్నారి మరణించిన సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. మార్కాపురం మండలం రాజుపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది.

Student death: ప్రకాశం జిల్లాలో విషాదం.. స్కూల్ పైకప్పు కూలి విద్యార్థి మృతి..!
Student Dies

Updated on: Aug 29, 2021 | 5:00 PM

School Building Slab Collapses: పాఠశాల పైకప్పు కూలి ఓ చిన్నారి మరణించిన సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. మార్కాపురం మండలం రాజుపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబు కూలి విద్యార్థి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పలువురు విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఆడుకునేందుకు వెళ్లారు. విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా భవనం పైకప్పు కూలింది. దీంతో అక్కడే ఉన్న విష్ణు అనే విద్యార్థి స్పాట్‌లోనే ప్రాణాలను కోల్పోయాడు.

విష్ణు.. మార్కాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నట్టు బంధువులు తెలిపారు. దీంతో విష్ణు కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా, ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read Also….  Murder: అతని వయసు 14.. ఆమె వయసు 15.. ఇద్దరు ప్రేమించుకున్నారు.. బాలికను కలవాలని పిలిచి దారుణ హత్య..!