జార్ఖండ్ (Jharkhand)లోని పశ్చిమ సింగ్‌భూమ్ సమీప అడవిలో సగానికి కాలిపోయిన భార్యాభర్తల మృతదేహాలను (half burnt dead bodies) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అందిన సమాచారం ప్రకారం మూఢ నమ్మకాల కారణంగా ఈ జంట హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ సంచలన కేసు జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత (Naxal-affected area)టోంటో పోలీస్ స్టేషన్ పరిధిలోని బొండు గ్రామంలో చోటుచేసుకుంది. మరోవైపు ఈ హత్యపై గ్రామస్థులు కూడా స్పష్టంగా స్పందించక పోవడంతో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా టోంటో పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్యంత నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బొండూ గ్రామంలో నివసించే గోమీ కెరాయ్, అతని భార్య హత్యకు గురైనట్లు గ్రామస్థుల నుంచి పోలీసు సూపరింటెండెంట్‌కు సమాచారం అందింది. ఎస్పీ అజయ్ లిండా ఆధ్వర్యంలో ఎస్‌డీపీఓ జగన్నాథ్‌పూర్ ఇకుర్ డంగ్‌డుంగ్, ఎస్‌డీపీఓ కిరిబూరు అజిత్ కుమార్ కుజూర్ నేతృత్వంలో పోలీసుల బృందం ఆదివారం (జనవరి 30) అడవిలో సోదాలు నిర్వహించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
సంచలనం రేపిన ఈ జంట హత్యల కేసులో పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ ప్రారంభించారు. ఇంత పెద్ద నేరం ఎవరు చేశారన్నది ఇంకా తెలియరాలేదు. బొండూ గ్రామ ప్రజలు ఘటనపై సమాచారం అందించేందుకు సిద్ధంగా లేరు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వవద్దని హంతకులు గ్రామస్థులను బెదిరించినట్లు సమాచారం. అంతేకాకుండా ఘటనపై ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారట. ఈ కారణంగానే పోలీసులకు సమాచారం అందడంలో జాప్యం జరిగిందని, నిజానికి జనవరి 20న హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మృతుడి సోదరుడు, మరికొందరి ప్రమేయమున్నట్లు ఎస్‌డిపిఒ కిరిబూరు అజిత్‌కుమార్ కుజూర్ తెలిపారు. మూఢనమ్మకాలు, మద్యపానం ఈ సంఘటనకు దారితీసిందని, స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని మీడియాకు వెల్లడించారు.
Also Read: