Hyderabad: అటుగా వచ్చిన కారు, ఖాకీలు కనిపించగానే కంగారు.. ఏంటా అని చెక్‌ చేయగా పెద్ద దందానే బయటపడింది..

|

Sep 03, 2022 | 8:06 AM

Hyderabad: రోజురోజుకీ సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. మనుషుల అత్యాశను, అవసరాలను ఆసరగా తీసుకొని కొందరు చట్ట వ్యతిరేక పనులు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇలా రోజుకో...

Hyderabad: అటుగా వచ్చిన కారు, ఖాకీలు కనిపించగానే కంగారు.. ఏంటా అని చెక్‌ చేయగా పెద్ద దందానే బయటపడింది..
Representative Image
Follow us on

Hyderabad: రోజురోజుకీ సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. మనుషుల అత్యాశను, అవసరాలను ఆసరగా తీసుకొని కొందరు చట్ట వ్యతిరేక పనులు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇలా రోజుకో కొత్త దందా వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో నటకీయ పరిణామాల నేపథ్యంలో ఫేక్‌ సర్టిఫికేట్ల దందా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఓ వ్యక్తి కారులో వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు రెగ్యులర్‌ చెకప్స్‌లో భాగంగా కారును ఆపారు. కారులో ఉన్న వ్యక్తి కంగారుపడడాన్ని గమినించిన పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది.

డిక్కీలో వెతకగా ఫేక్‌ సర్టిఫికెట్స్‌ బయటపడ్డాయి. ఈ ఉదంతం శుక్రవారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగింది. ఆ కారులో ఉన్న వ్యక్తి పేరు మహమ్మద్‌ ఖలీమొద్దీన్‌ అని అతను ఇంతకు ముందే పలు కేసుల్లో అరెస్ట్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన పదో తరగతి, ఇంటర్‌తో పాటు పలు యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కంప్యూటర్‌, ప్రింటర్‌, ల్యామినేషన్‌ మిషన్‌ను పోలీసులు సీజ్‌ చేశారు.

ఈ విషయమై ఏసీపీ పురుషోత్తమ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘చాంద్రాయణగుట్టకు చెందిన ఖలీమొద్దీన్‌, పహాడీషరీఫ్‌ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు తయారీ చేస్తున్నాడు. నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని’ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని నేర వార్తల కోసం క్లిక్ చేయండి..