సికింద్రాబాద్ జ్యూవెల్లరీ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడు ఎవరో తెలిసేసరికి అవాక్కయిన..

|

Jan 16, 2021 | 1:11 PM

Latest crime news: సికింద్రాబాద్‌లోని చందు జైన్‌ జ్యూవెల్లరీ దుకాణంలో జరిగిన చోరీని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితుడు గతంలో

సికింద్రాబాద్ జ్యూవెల్లరీ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడు ఎవరో తెలిసేసరికి అవాక్కయిన..
Follow us on

Latest crime news: సికింద్రాబాద్‌లోని చందు జైన్‌ జ్యూవెల్లరీ దుకాణంలో జరిగిన చోరీని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితుడు గతంలో షాపులో పనిచేసిన డ్రైవర్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందు జైన్‌ జ్యూవెల్లరీ షాపులో శుక్రవారం చోరీ జరిగింది.

షాపు తెరిచేందుకు వెళ్లిన ఉద్యోగి లోపల ఉన్న లాకర్లు పగులగొట్టినట్టు ఉండటంతో యజమానికి సమాచారం అందించాడు. వెంటనే యజామాని, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమెరాలు పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సీసీ కెమెరాలోని దృశ్యాలను పరిశీలించిన పోలీసులు గతంలో డ్రైవర్‌‌గా పనిచేసిన వ్యక్తి చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులు నిందితుడి అదుపులోకి తీసుకొని విచారించగా తను, తన ప్రెండ్స్ కలిసి చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. దొంగిలించిన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.

Man Arrested: మాజీ డీజీపీ ఇంట్లో చోరీ.. ఏం దొంగిలించాడో తెలిస్తే షాక్ అవుతారు..