Uttar Pradesh: యూపీలో దారుణం..కాబోయే భర్త ముందే యువతిపై 8 మంది అత్యాచారం!

ఉత్తర ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో దారుణం ఘటన చోటుచేసుకుంది. కాబోయే భర్తతో కలిసి పిక్నిక్‌కు వెళ్లిపై ఓ యువతిపై ఓ గ్యాంగ్‌ అత్యాచారానికి పాల్పడింది. కాబోయే భర్త ముందే ఎనిమంది మంది దుండగులు ఆ అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

Uttar Pradesh: యూపీలో దారుణం..కాబోయే భర్త ముందే యువతిపై 8 మంది అత్యాచారం!
Up Incident

Updated on: Apr 14, 2025 | 5:38 PM

సమాజంలో రోజురోజుకు ఘోరాలు పెరిగి పోతున్నాయి. ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే..మనుషుల మధ్య జీవించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా లాభం లేకుండా పోతుంది. ఎన్ని చట్టాలు వచ్చినా మమ్మల్ని ఏం చేయలేవు అనేలా వ్యవహరిస్తున్నారు కొందరు. రోడ్లపై అమ్మాయి కనిపిస్తే చాలు..కాలయములై మీదకు వస్తున్నారు. ఇలాంటి ఓ ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో చోటుచేసుకుంది. కాబోయే భర్తతో కలిసి పిక్నిక్‌ వెళ్లిన ఓ యువతిపై ఎనిమిది మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు వచ్చిన కాబేయే భర్తను చితకబాదారు. ఏప్రిత్ 10న ఈ ఘటన జరగగా..తాగాజా ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉత్తర ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌కు చెదింన ఓ జంట త్వరలో పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యారు. అయితే పెళ్లికి ముందు కాబోయే భర్తతో సరదాగా తిరుగుదామని ఆ యువతి నాద్రాయ్ అక్విడక్ట్ అనే పిక్నిక్ స్పాట్‌ను వెళ్లింది. అక్కడే ఉన్న హజారా కాలువపై కాబోయే భర్తతో కలిసి తిరుగుతూ ఉంది. ఇంతలోనే అక్కడికి వచ్చిన ఓ గ్యాంగ్‌ ఒంటరిగా ఉన్న జంటను చూసి దారుణానికి ఒడిగట్టారు. కాబోయే భర్త ముందే ఆ అమ్మాయిని పక్కనే ఉన్న గదిలోకి లాక్కెళ్లి..ఎనిమిది మంది కలిసి అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకోవడాని ప్రయత్నించిన కాబోయే భర్తను చితకబాదారు. అతని దగ్గర ఉన్న డబ్బు లాక్కొని అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఈ దుర్ఘటన ఏప్రిల్‌ 10వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు జరిగినట్టు తెలుస్తోంది.పిక్నిక్‌లో జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు ఆ అమ్మాయికి కాబోయే భర్త. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎనిమిది మందిలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మితగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..