
ప్రేమించిన యువతి నిరాకరించిదనే మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమ విఫలమైందనే కారణంగా తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు పరిశీలించగా..
కామారెడ్డి పట్టణంలోని స్థానిక అశోక్ నగర్ కాలనీకి చెందిన 23ఏళ్ల యువకుడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే, సదరు యువతి అతడి ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, కాగా అతడు, చనిపోయే అరగంట ముందు టిక్‌టాక్‌లో వీడియో తీశాడు. దానిని అప్‌డేట్ చేసి తన స్టేటస్‌గా పెట్టుకున్నట్లు వారు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే, ఈ ఘటనలో మరో విషాదాంశం ఏమిటంటే..మృతుడి స్వస్థలం కామారెడ్డి మండలం తిమ్మక్కపల్లి కాగా కొంతకాలంగా తల్లితో కలిసి అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. గతంలో సంతోష్ తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం కొడుకు కూడా అలాగే చనిపోవటంతో వారి కుటుంబంలో పెను విషాదం నెలకొంది.