పరువు హత్య.. కన్న కూతురిని హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..

|

Jan 11, 2024 | 11:16 AM

పెరుమాళ్లు, రోజా అనే దంపతులు తమ బిడ్డ ఐశ్వర్యను చంపేశారు. తల్లిదండ్రులను ఎదిరించి, నవీన్‌ అనే యువకుడిని ఐశ్వర్య పెళ్లిచేసుకోవడమే ఇందుకు కారణం. పెళ్లి జరిగిన నెలరోజుల తర్వాత తల్లిదండ్రులకు బిడ్డ దగ్గరకు వచ్చారు. కూతురిని తమతో ఇంటికి తీసుకెళ్లారు. రెండురోజుల తర్వాత బిడ్డను పంపిస్తామంటూ ఆ తల్లిదండ్రులు నమ్మబలికారు.

పరువు హత్య.. కన్న కూతురిని హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
Crime News
Follow us on

పరువు అనే ఫాల్స్‌ ప్రిస్టేజ్‌, కన్నపేగును చంపేసింది. తమిళనాడులో కలకలం రేపుతున్న పరువుహత్య ఇది. మరో కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందనే కారణంతోనే తమ బిడ్డను ఆ తల్లిదండ్రులు చంపుకున్నారు. తంజావూరులోని పట్టుకోటైలో ఈ దారుణం జరిగింది. తమ బిడ్డను హత్యచేసి, గుట్టుచప్పుడు కాకుండా ఆ డెడ్‌బాడీని పెట్రోల్‌ పోసి తగులబెట్టేశారు. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది.

పెరుమాళ్లు, రోజా అనే దంపతులు తమ బిడ్డ ఐశ్వర్యను చంపేశారు. తల్లిదండ్రులను ఎదిరించి, నవీన్‌ అనే యువకుడిని ఐశ్వర్య పెళ్లిచేసుకోవడమే ఇందుకు కారణం. పెళ్లి జరిగిన నెలరోజుల తర్వాత తల్లిదండ్రులకు బిడ్డ దగ్గరకు వచ్చారు. కూతురిని తమతో ఇంటికి తీసుకెళ్లారు. రెండురోజుల తర్వాత బిడ్డను పంపిస్తామంటూ ఆ తల్లిదండ్రులు నమ్మబలికారు. అయినా ఐశ్వర్యను తిరిగి పంపకపోవడంతో పోలీసులను నవీన్‌ ఆశ్రయించాడు.

ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల తీరు వివాదాస్పదం అయింది. ఐశ్వర్య భర్త నవీన్‌, ఈ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తెచ్చాడు. అయినా పోలీసులు సరైన సమయంలో స్పందించలేదని తేలింది. ఫిర్యాదు అందినా పట్టించుకోని పల్లాడం ఎస్సై మురుగయ్యను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి