Oxygen Tanker Missing: ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్.. రంగంలోకి దిగిన పోలీసులు.. ఎక్కడంటే..?

|

Apr 24, 2021 | 7:08 AM

Medical Oxygen Tanker Missing: దేశంలో కరోనావైరస్ కోరలుచాస్తోంది. నిత్యం లాక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో చాలాచోట్ల ఆక్సిజన్

Oxygen Tanker Missing: ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్.. రంగంలోకి దిగిన పోలీసులు.. ఎక్కడంటే..?
Oxygen Tanker Missing
Follow us on

Medical Oxygen Tanker Missing: దేశంలో కరోనావైరస్ కోరలుచాస్తోంది. నిత్యం లాక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో చాలాచోట్ల ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో కరోనా బాధితులు, సాధారణ రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. దేశమంతటా ఇదే పరిస్థితి కనపిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో.. ఓ వైపు ఆక్సిజన్‌ కొరతతో ఆందోళన చెందుతుంటే.. మరోవైపు హర్యానాలో ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న ట్యాంకర్‌ అదృశ్యం కావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. వివరాలు.. హర్యానాలోని పానిపట్‌ నుంచి సిర్సాకు ఆక్సిజన్‌ లోడుతో ఓ ట్యాంకర్‌ బయలుదేరింది. ఈ క్రమంలో మార్గమధ్యంలోనే ఆక్సిజన్ ట్యాంకర్ అదృశ్యమైపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పానిపట్ జిల్లా డ్రగ్‌ కంట్రోలర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బుధవారం పానిపట్‌ ప్లాంట్‌లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ నింపుకున్న ట్యాంకర్ సిర్సాకు బయల్దేరి వెళ్లింది. అయితే ఆ వాహనం గమ్యస్థానానికి చేరకపోవడంతో సంబంధిత అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు. ట్యాంకర్ మార్గంలో సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఎవరైనా అడ్డుకున్నారా..? లేక డ్రైవరే దారి మళ్లించాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరిగిన తరుణంలో ఆక్సిజన్ ట్యాంకర్‌ అదృశ్యం కావడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Also Read:

UK Variant: యూకే వేరియంట్‌ వల్లనే ఢిల్లీలో భారీగా కోవిడ్‌ కేసులు.. ఇండియాలో మొత్తం 1644 వేరియంట్‌ కేసులు

Justice NV Ramana: ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రమాణం.. 48వ సీజేఐగా బాధ్యతల స్వీకరణ