Encounter: మ‌హారాష్ట్ర – ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. నక్సల్స్ ఆయుధాల డంప్ ధ్వంసం

|

Mar 06, 2021 | 12:43 PM

Jawan injured in encounter: మహారాష్ట్ర ,చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్. గడ్చిరోలి జిల్లా బాంరాఘఢ్ తాలుకా కోపర్సి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కూంబింగ్..

Encounter: మ‌హారాష్ట్ర - ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. నక్సల్స్ ఆయుధాల డంప్ ధ్వంసం
Follow us on

Jawan injured in encounter: మహారాష్ట్ర ,చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్. గడ్చిరోలి జిల్లా బాంరాఘఢ్ తాలుకా కోపర్సి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న సీ60 కమాండోలు, మావోయిస్టుల మధ్య రెండు సార్లు ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి సీ60 కమాండోలను మావోయిస్టులు చుట్టుముట్టారని.. ఆ ప్రాంతంలో మందుపాతరలను అమర్చి పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు. మందుపాతరలు పేలి సీ60 కమాండోకు గాయాలైనట్లు పేర్కొన్నారు. గాయాలైన కమాండోను అత్యవసర చికిత్స నిమిత్తం హెలిక్యాప్టర్ ద్వారా గడ్చిరోలిలోని ఆసుపత్రికి తరలింపు. అయితే తప్పించుకున్న మావోయిస్టుల కోసం భద్రత దళాలు భారీ కూంబీంగ్ చేపట్టాయి.

ఈ క్రమంలో మ‌హారాష్ర్ట గ‌డ్చిరోలి జిల్లాలో మావోలకు చెందిన ఆయుధాల త‌యారీ యూనిట్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. కూంబింగ్ చేస్తుండ‌గా.. నక్సల్స్ డంప్ బ‌య‌ట‌ప‌డింద‌ని మ‌హారాష్ర్ట హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఈ ఆప‌రేష‌న్ 48 గంట‌ల పాటు కొన‌సాగింద‌ని పేర్కొన్నారు. నక్సల్స్ కోసం ముమ్మర గాలింపు చర్యలు జరుగుతున్నాయని తెలిపారు.

Also Read:

డాలర్ స్మగ్లింగ్ కేసులో కేరళ స్పీకర్ శ్రీరామకృష్ణన్ కు కస్టమ్స్ శాఖ సమన్లు