Bihar ASI: గ్రామంలో గొడవ అవుతుందని.. సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన పోలీసు అధికారిపై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. తాళ్లతో కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసు యూనిఫారంలో ఉన్న వ్యక్తిపై కొంతమంది వ్యక్తులు దాడి చేసి దుర్భాషలాడిన సంఘటన బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా మోతిహరి పోలీస్‌స్టేషన్ పరిధిలో దీపావళి రోజున చోటుచేసుకుంది. దీంతో దాడి చేసిన వ్యక్తుల కోసం పోలీసులు రంగంలోకి దిగారు. దీపావళి పండుగ రోజున మోతిహరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధరమ్‌పుర్ గ్రామంలో కొంతమంది మద్యం తాగి పేకాట ఆడుతూ గొడవకు దిగారు. దీంతో గ్రామంలో గొడవ జరుగుతోందంటూ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఏఎస్‌ఐ సీతారాం దాస్ మరికొంతమంది సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు.
అయితే ఏఎస్‌ఐ అక్కడికి వెళ్లిన అనంతరం యువకులు మరింత రెచ్చిపోయారు. దీపావళి పండగనాడు పోలీసులు పెట్రోలింగ్ ఎలా చేస్తారంటూ.. దుర్భాలాడుతూ ఏఎస్‌ఐని చుట్టుముట్టారు. ఓ స్తంభానికి చేతులను తాడుతో వెనక్కి కట్టేసి చితకబాదారు. ఆ తర్వాత వదిలేయడంతో ఏఎస్ఐ సీతారాం దాస్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం పలువురు యువకులపై పోలీసులు కేసు నమోదుచేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఛప్రా బహాస్‌లోని ధర్మపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఉన్నతాధికారులు కూడా ఆరాతీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జరీ చేశారు.
Motihari, Bihar, police officer, Diwali, social media, police, Diwali 2021, Dharmpur village, Chhapra Bahas, Sitaram Das, Sugaili police station,