Hyderabad Rash Driving :హైదరాబాద్ పాతబస్తీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. శాలిబండ చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అదుపుతప్పిన కారు అతివేగంగా వాహనాలపైకి దూసుకెళ్లింది. అడ్డొచ్చిన వెహికల్‌తో పాటు రోడ్డుపై ఉన్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యాచకురాలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఒక్కసారిగా ఢీ కొట్టడంతో.. ఓ ఆటోతో పాటు పలు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. సాలమ్మ అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తర్వాత కారు యజమాని పరారయ్యాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Balaram Naik: అన్ని పత్రాలు ఉన్నాయి.. ఈసీ అనర్హత వేటుపై స్పందించిన బలరాం నాయక్..