డబ్బుల వర్షం కురుస్తుందని క్షుద్రపూజలు.. నమ్మారో అంతే సంగతులు.. భారీ మోసం వెలుగులోకి

|

Feb 11, 2021 | 10:13 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె ఘటన మరువక ముందే తెలంగాణలోని పెద్దపల్లిలో ఇదే తరహా ఘటన వెలుగు చూసింది.

డబ్బుల వర్షం కురుస్తుందని క్షుద్రపూజలు.. నమ్మారో అంతే సంగతులు.. భారీ మోసం వెలుగులోకి
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె ఘటన మరువక ముందే తెలంగాణలోని పెద్దపల్లిలో ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. క్షుద్రపూజల పేరుతో మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

మహారాష్ట్రకు చెందిన క్షుద్రపూజల ముఠా జిల్లాలో తిరుగుతూ ప్రజలను మోసం చేస్తోంది. మహిళలతో బారిష్ పూజ చేస్తే డబ్బుల వర్షం కురుస్తుందంటూ ప్రచారం చేస్తూ అమాయక ప్రజలను బురుడీ కొట్టిస్తోంది. డబ్బు, బంగారం ఆశ చూపి ఈ పూజల కోసం ఓ యువతిని కొనుగోలు చేసేందుకు ఈ ముఠా ప్రయత్నం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు..వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రాజేందర్, కుమార్‌, తిరుపతి, మంతెన శ్రీనివాస్‌గా గుర్తించారు.

ఈ ముఠా బారిష్ పూజతో డబ్బులు కురిసేలా చేసి అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్షుద్రపూజల పేరుతో ఎవరైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read: