Nusrat Jahan: నటి నుస్రత్ జహాన్ – నిఖిల్ జైన్ వివాహం ‘చట్టబద్ధంగా చెల్లదు’.. కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు

|

Nov 18, 2021 | 11:36 AM

బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్‌ జహాన్‌, నిఖిల్‌ జైన్‌ల పెళ్లి చట్టబద్ధంగా చెల్లదని కోల్‌కతా కోర్టు తీర్పు వెలువరించింది.

Nusrat Jahan: నటి నుస్రత్ జహాన్ - నిఖిల్ జైన్ వివాహం చట్టబద్ధంగా చెల్లదు.. కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు
Nusrat Jahan Nikhil Jain
Follow us on

Nusrat Jahan-Nikhil Jain Wedding: బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్‌ జహాన్‌, నిఖిల్‌ జైన్‌ల పెళ్లి చట్టబద్ధంగా చెల్లదని కోల్‌కతా కోర్టు తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన వివాహం చెల్లదని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె అఫిడవిట్‌ను ఎలా పరిగణిస్తారని భారతీయ జనతా పార్టీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పు ప్రకటించింది. వీరిద్దరూ టర్కీలో వివాహం చేసుకున్నారని, మతాంతర వివాహం భారతదేశంలో నమోదు కాలేదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే, లోక్‌సభ అఫిడవిట్‌లో నుస్రత్ జహాన్ తాను చట్టబద్ధంగా వివాహం చేసుకున్నట్లు ప్రకటించింది. టీఎంసీ ఎంపీ నుస్రత్ కూడా నిఖిల్‌తో తన వివాహం టర్కీ చట్టం ప్రకారం జరిగిందని, అందువల్ల భారతదేశంలో చెల్లుబాటు కాదని ప్రకటించారు. తన నిధులు దుర్వినియోగం అయ్యాయని నుస్రత్ ఆరోపించారు. భారతదేశంలో తమ వివాహం చెల్లదని నుస్రత్ జహాన్ పేర్కొన్న తర్వాత, పెళ్లిని రిజిస్టర్ చేయమని పలుసార్లు తాను నుస్రత్‌ను అభ్యర్థించానని, అయితే ఆమె తన అభ్యర్థనలన్నింటినీ తప్పించిందని నిఖిల్ పేర్కొన్నారు.

కాగా గత సంవత్సరం నవంబరు నుంచి తాము విడిపోయామని నిఖిల్ జైన్ చెప్పారు. నుస్రత్ జహాన్, నిఖిల్ జైన్ కొంతకాలం డేటింగ్ తర్వాత 2019జూన్ 19న పెళ్లి చేసుకున్నారు. వారు టర్కీలో ఒక వేడుకలో వివాహం చేసుకున్నారు. తర్వాత కోల్‌కతాలో వివాహ రిసెప్షన్‌ నిర్వహించారు. మరోవైపు విడిపోయాక 2021 ఆగస్ట్ 26వతేదీన నుస్రత్ జహాన్ యిషాన్ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. నుస్రత్ కుమారుడు ఇషాన్ జనన ధృవీకరణ పత్రంలో యష్ దాస్‌గుప్తా పేరును తండ్రిగా చేర్చింది.

ఇదిలావుంటే, లోక్‌సభ అఫిడవిట్‌లో, నుస్రత్ జహాన్ తాను చట్టబద్ధంగా వివాహం చేసుకున్నట్లు ప్రకటించింది. టర్కీలోని బోడ్రమ్‌లో 19/06/2019న జరిగిన వివాహం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని ప్రకటించారని అలీపూర్ 2వ కోర్టు సివిల్ జడ్జి ఎస్ రాయ్ తెలిపారు. వారిద్దరూ వివాహం చేసుకోలేదని కోర్టును ప్రకటించాలని జైన్ కోర్టులో దావా వేశారు. తాను నుస్రత్ జహాన్ బంధువులు, సన్నిహితులతో కలిసి వివాహ వేడుకను జరుపుకున్నట్లు జైన్ అంగీకరించడాన్ని గమనించిన కోర్టు.. “పాశ్చాత్య భారతీయ శైలి ,హిందూ వివాహ ఆచారాలను అనుసరించి” వివాహం టర్కీలో నమోదు కాలేదని పేర్కొంది.

భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి ఉండడం ప్రారంభించినప్పటికీ, నుస్రత్ జహాన్ వివాహాన్ని కొనసాగించడానికి ఇష్టపడలేదని జైన్ పేర్కొన్నారు. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రత్యేక వివాహ చట్టం కింద తమ వివాహాన్ని నమోదు చేసుకోలేదు. కాగా, దావాలోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వివాహం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని కోర్టు అభిప్రాయపడింది.

Read Also….  KTR Helping Photos: రియల్ హీరో అనిపించుకుంటున్న కేటీఆర్.. దగ్గరుండి మరీ రోడ్డుప్రమాదంకు గురైన విద్యార్థులకు..(ఫొటోస్)