Nizamabad Honey trap : వామ్మో.. కిలాడీ లేడీలతో బీ కేర్ ఫుల్, పరువు సంగతి దేవుడెరుగు, మొత్తం ప్రాణాలే హుష్ పటాక్.. !

|

Apr 01, 2021 | 10:14 AM

Nizamabad Honey trap : మగాళ్లేకాదు, ప్రస్తుత రోజుల్లో లేడీస్ తోనూ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. వివిధ రకాలుగా పురుషులకు..

Nizamabad Honey trap :  వామ్మో.. కిలాడీ లేడీలతో బీ కేర్ ఫుల్, పరువు సంగతి దేవుడెరుగు, మొత్తం ప్రాణాలే హుష్ పటాక్.. !
Nzb Naveen Death
Follow us on

Nizamabad Honey trap : మగాళ్లేకాదు, ప్రస్తుత రోజుల్లో లేడీస్ తోనూ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. వివిధ రకాలుగా పురుషులకు వలవేసి పనికానిచ్చేసుకుంటున్నారు కొందరు కిలాడీ లేడీలు. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో ఓ యువకుడి ప్రాణం తీసింది ఇలాంటి ఘటనే. కన్నింగ్ లేడీ వీడియో కాల్‌ వలలో పడి విలవిలలాడిపోయాడు శ్రీకాంత్ అనే యువకుడు. పరిచయం లేని అమ్మాయితో వీడియో కాల్ చేసి పూర్తిగా ఆ అమ్మాయి ట్రాప్‌లో పడిపోయాడు. దీంతో అతని నగ్నవీడియోలతో శ్రీకాంత్‌ని బ్లాక్‌మెయిల్‌ చేసింది ఆ వగలాడి. అంతేకాదు, శ్రీకాంత్‌ నగ్న వీడియోలు ఆన్‌లైన్‌లో పెడతామని బెదిరించింది. అతని నుంచి లక్షల్లో డబ్బు డిమాండ్‌ చేసింది. దీంతో ఆ వీడియోలతో ఎక్కడ తన పరువు పోతుందనే భయంతో శ్రీకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మొత్తం నవీపేట ప్రాంత ప్రజల్నేకాదు, యావత్ సమాజాన్నీ ఖిన్నులయ్యేలా చేసింది.

Read also : సందిగ్ధతను తొలగించిన నిర్మలా సీతారామన్, ఇప్పటివరకూ ఉన్న వడ్డీరేట్లు కొనసాగుతాయని క్లారిటీ