NIA chargesheets: సోషల్ మీడియాలో మావోయిస్టు భావజాల ప్రచారం.. ముగ్గురు సానుభూతిపరులపై ఎన్ఐఏ చార్జిషీట్లు!

|

Jun 12, 2021 | 6:44 AM

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ ముగ్గురిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది.

NIA chargesheets: సోషల్ మీడియాలో మావోయిస్టు భావజాల ప్రచారం.. ముగ్గురు సానుభూతిపరులపై ఎన్ఐఏ చార్జిషీట్లు!
NIA
Follow us on

NIA chargesheets three CPI (Maoist) operatives: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ ముగ్గురిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని మధురై నగరంలో ఫేస్‌బుక్ అకౌంట్లలో అభ్యంతరకరమైన అంశాలను అప్ లోడింగ్ చేస్తున్న ముగ్గురు సీపీఐ మావోయిస్టు ఆపరేటర్లపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. మధురై నగరానికి చెందిన వివేకానందన్ అలియాస్ వివేక్, సురేష్ రాజన్, మోహన్ రామస్వామిలు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైన విషయాలను పోస్టు చేస్తున్నారని తేలింది. దీంతో ఎన్ఐఏ అధికారులు ముగ్గురు మావోయిస్టు ఆపరేటివ్‌లపై కేసు నమోదు చేసి వారిపై చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు.

వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా యువతను మావోయిస్ట్ పట్ల ఆకర్షితులయ్యేలా నేరపూరిత కుట్రకు సంబంధించి ముగ్గురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారణ జరిపింది. దీంతో ముగ్గురు నిందితులు మావోయిస్టు సంస్థల భావజాలాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేస్తున్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. తీవ్రవాద సాహిత్యంతోపాటు మావోయిస్టుల డాక్యుమెంట్లు, కరపత్రాలు, బ్రోచర్లు, బ్యానర్లు ఫోటోలను వీరు సోషల్ మీడియాలో పంచుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఎన్ఐఏ అధికారులు వారిపై కోర్టులో చార్జిషీటును దాఖలు చేశారు.

Read Also… Driving Rules: డ్రైవింగ్‌ టెస్ట్ లేకుండానే లైసెన్స్ పొందవచ్చు.. జులై 1 నుంచి కొత్త నిబంధనలు..