Suicide: ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న కొత్త పెళ్లి కొడుకు.. పెళ్లైన నెల రోజులకే కానరాని లోకలకు..

Suicide: విశాఖపట్నంలోని అనకాపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లయిన నెల రోజులకే ఓ నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

Suicide: ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న కొత్త పెళ్లి కొడుకు.. పెళ్లైన నెల రోజులకే కానరాని లోకలకు..
Suicide In Vishaka

Updated on: Jul 26, 2021 | 7:04 AM

Suicide: విశాఖపట్నంలోని అనకాపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లయిన నెల రోజులకే ఓ నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన మెల్లేటి జగన్‌ ప్రసాద్‌ (26) అనకాపల్లిలో నివాసం ఉంటున్నాడు. ప్రసాద్‌కు గత నెల 4వ తేదీదా మేనత్త కూతురుతో వివాహం జరిగింది. ప్రసాద్‌ వ్యాన్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లయిన కొత్త జంట బీఆర్‌టీ కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. అయితే అంతా సాఫీగా సాగుతోందనుకుంటోన్న సమయంలో ప్రసాద్‌ తీసుకున్న నిర్ణయం ఆయన ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రసాద్‌ శనివారం తన భార్యను బీఆర్‌టీ కాలనీలో ఉంటున్న ఆమె పుట్టింటికి పంపించాడు. ఆదివారం ఉదయం ఎంతకూ ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన భార్య , ప్రసాద్‌ ఇంకా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూసింది. ప్రసాద్‌ ఇంట్లో ఉరేసుకొని ఉండడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. దీంతో స్థానికులు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సింది. పెళ్లైన కొన్ని రోజులకే ఇలా విగత జీవిగా మారడంతో ప్రసాద్‌ ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Also Read: Covid Variant: బ్రిటన్‌లో కలకలం రేపుతున్న కొత్త వేరియంట్‌ వైరస్‌.. 16 మందిలో గుర్తింపు

Ration Cards : పేదల కడుపు నింపే నూతన రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం .. రేపే ముహూర్తం

Ramappa : ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప ఆలయం.. ఎంపిక చేసిన యునెస్కో ప్రతినిధులు..