విశాఖ ఏజెన్సీ కల్తీ మద్యం కేసు మరో మలుపు తిరిగింది. భర్తను హతమార్చేందుకు భార్యనే విషం కలిపిన మద్యాన్ని తాగించిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఏజెన్సీ ప్రాంతంలోని కొయ్యూరు మండలం భీమారంలో కల్తీ మద్యం కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. భర్త బాలరాజు వేధింపులు తట్టుకోలేక మద్యంలో భార్య పురుగులు మందు కలిపింది. ఈ క్రమంలో మద్యాన్ని సేవించిన బాలరాజుతో పాటు అతడి స్నేహితుడు కూడా మృతి చెందారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు మొదట కల్తీ మద్యం కేసుగా నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. ఇదే క్రమంలో విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.