Nellore: కవలల హత్యకేసులో మిస్టరీ వీడింది.. హత్య చేసింది ఎవరంటే…?

పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఎరగని చిన్నారులు...అమ్మానాన్న తప్ప లోకం తెలియని పసిబిడ్డలు... లోకాన్ని చూడకముందే హత్యలకు గురవుతున్నారు.

Nellore: కవలల హత్యకేసులో మిస్టరీ వీడింది.. హత్య చేసింది ఎవరంటే...?
Nellorre Twins Death

Edited By:

Updated on: Jul 18, 2021 | 11:03 AM

పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఎరగని చిన్నారులు…అమ్మానాన్న తప్ప లోకం తెలియని పసిబిడ్డలు… లోకాన్ని చూడకముందే హత్యలకు గురవుతున్నారు. కన్నప్రేమే యమపాశమై కొందర్ని కాటేస్తే..బంధువులే రాబందులై పసిబిడ్డల్ని పొట్టన పెట్టుకుంటున్నారు.పెద్దల ఈగోలకు..పగలకు పాపం పసివాళ్లు బలైపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు..ఇటీవల జరుగుతోన్న వరుస ఘటనలు మానవత్వానికి మచ్చగా మారాయి.

ఇటీవల నెల్లూరులో జరిగిన కవల చిన్నారుల హత్యకేసులోనూ కన్న తండ్రే హంతకుడిగా మారాడు. ముక్కుపచ్చలారని ఆ కవల పిల్లల్ని పొట్టన పెట్టుకుంది.. స్వయానా కన్నతండ్రే అని పోలీసులు ఇంటరాగేషన్‌లో బయటపడింది. దంపతుల మధ్య విభేదాల కారణంగా.. పాలల్లో విషం కలిపి హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు.

గత నెల 20న మనుబోలు మండలం రాజవోలుపాడులో కవలల హత్య కేసు తీవ్ర ఆవేదన కలిగించింది. పది నెలల వయసున్న ఇద్దరు కవల పిల్లలు డబ్బా పాలు తాగాక అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు. చిన్నారుల తల్లిదండ్రులు పుట్టా వెంకటరమణయ్య, నాగరత్నమ్మలకు రెండేళ్ల కిందట వివాహమైంది. కొన్నాళ్లు బాగానే ఉన్న వారి సంసారంలో కలతలు వచ్చాయి. ఏడాది నుంచి వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడంతో కలిసే ఉంటున్నారు. ఈ లోపే ఇద్దరు పిల్లలు చనిపోయారు.

దీనిపై ఇంటరాగేషన్ చేసిన పోలీసులకు భార్యభర్తలు ఇద్దరూ.. పొంతన లేని సమాధానం చెప్పారు. భార్య చేశాడని భర్త, భర్త చేశాడని భార్య నిందలు వేసుకున్నారు. ఆ సమయంలో టీవీ9తో ఆ కిరాతక తండ్రి ఎంత అమాయకుడిలా మాట్లాడాడు. ఎక్కడో అనుమానం కొట్టింది. పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. దీంతో నేరాన్ని అంగీకరించాడు నిందితుడు వెంకటసుబ్బయ్య.

Also Read: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. గత 24 గంటల్లో 518 మంది మృత్యువాత..

 ముంబైలో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి