కూతురు వరుసైన 11 ఏళ్ల బాలికపై లైంగికదాడి

కామాంధుల కబంధహస్తాలకు మరో చిన్నారి బలైంది. అన్యం పుణ్యం ఎరుగుని కూతురు వరుసైన 11 ఏళ్ల బాలికపై దుర్మార్గుడు బూతు బొమ్మలు చూపిస్తూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కూతురు వరుసైన 11 ఏళ్ల బాలికపై లైంగికదాడి

Updated on: Jul 14, 2020 | 10:20 PM

కామాంధుల కబంధహస్తాలకు మరో చిన్నారి బలైంది. అన్యం పుణ్యం ఎరుగుని కూతురు వరుసైన 11 ఏళ్ల బాలికపై దుర్మార్గుడు బూతు బొమ్మలు చూపిస్తూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం బసవరాజు పాలెంకు చెందిన 11 ఏళ్ల బాలిక మేకలను మేపుకుండా గ్రామ శివారుకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన వరుసకు బాబాయి అయిన నిందితుడు(35) బాలిక వద్దకు వచ్చాడు. బాలికకు మాయమాటలు చెప్పి సెల్ పోన్ లో సినిమాలు చూపిస్తానంటూ బూతు బొమ్మలు చూపించాడు. బాలికను మభ్యపెట్టి .. చిన్నారిపై కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. కాగా, జరిగిన విషయాన్ని బాలిక ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.