Mumbai Nirbhaya: మానవ మృగాల దాడిలో గాయపడ్డ మరో నిర్భయ మృతి.. అఘాయిత్యానికి పాల్పడి, ఆపై ఇనుప రాడ్‌తో..

|

Sep 11, 2021 | 4:13 PM

ముంబై మహానగరంలో జరిగిన మానవ మృగాల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది.

Mumbai Nirbhaya: మానవ మృగాల దాడిలో గాయపడ్డ మరో నిర్భయ మృతి.. అఘాయిత్యానికి పాల్పడి, ఆపై ఇనుప రాడ్‌తో..
Mumbai Rape Case
Follow us on

Mumbai Nirbhaya: మహారాష్ట్రలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఘటనకు ఏ మాత్రం తీసిపోని విధంగా 32 ఏళ్ల మహిళపై కిరాతకులు అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి ప్రయివేట్‌ భాగాల్లో రాడ్డును చొప్పించారు. నడిరోడ్డుపై రక్తపు మడుగులో ఆమెను వదిలి వెళ్లగా.. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు.. చికిత్సపొందుతూ ఆస్పత్రిల్లో ప్రాణాలు వదిలారు. ముంబై మహానగరంలో జరిగిన మానవ మృగాల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. ఘట్కోపర్‌లోని రాజావాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు శనివారం ప్రాణాలను కోల్పోయినట్టు ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి.

శుక్రవారం తెల్లవారుజామున సకినాక ప్రాంతంలోని ఖైరాని రోడ్డుపై వెళ్తున్న ఆమెను అడ్డగించిన దుండగులు.. ఆమెపై కర్కశంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితుడు తొలుత అత్యాచారం చేసిన అనంతరం అత్యంత పాశవిక చర్యకు ఒడిగట్టాడు. ఆమె రహస్య భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించి తీవ్రంగా గాయపర్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను హుటాహుటీన ఘట్కోవర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఇవాళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీలను సేకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం నిందితుడు ఆమెను ఓ టెంపోలో పడేసి పరారయ్యారు. రక్తపు మడుగులో, అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు పోలీస్ కంట్రోల్ రూముకు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఈకేసును సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడైన 45 ఏళ్ల వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనక మరికొందరు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించిన నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చేస్తామని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు.

Read Also…  Corona in Telanga Schools: నల్గొండ సెయింట్ ఆల్ఫోన్సెస్ హైస్కూల్ లో కరోనా కకలం.. ప్రిన్సిపాల్ మృతి, 3 టీచర్లకు పాజిటివ్